Dimple Yadav : మెయిన్ పురి బ‌రిలో డింపుల్ యాద‌వ్

స‌మాజ్ వాది పార్టీ త‌ర‌పున ఎంపిక

Dimple Yadav : ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి ములాయం సింగ్ యాద‌వ్ ఇటీవ‌ల మ‌ర‌ణించారు. దీంతో మెయిన్ పురి లోక్ స‌భ స్థానానికి ఖాళీ ఏర్ప‌డింది. స‌మాజ్ వాది పార్టీ చీఫ్‌, మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ స‌తీమ‌ణి డింపుల్ యాద‌వ్(Dimple Yadav) పోటీ చేయ‌నున్నారు ఈ స్థానం నుంచి

ఈ మేర‌కు స‌మాజ్ వాది పార్టీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ములాయం మ‌ర‌ణంతో మెయిన్ పురి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.

ఇదిలా ఉండ‌గా గ‌త కొన్నేళ్లుగా ఈ నియోజ‌క‌వ‌ర్గం స‌మాజ్ వాది పార్టీకి కంచుకోట‌గా ఉంటూ వ‌స్తోంది. 1996 నుంచి ఇక్క‌డ స‌మాజ్ వాది పార్టీ అభ్య‌ర్థి గెలుస్తూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ఈ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసింది. డిసెంబ‌ర్ 5న ఉప ఎన్నిక‌కు పోలింగ్ జ‌రుగుతుంది.

డిసెంబ‌ర్ 8న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఇదిలా ఉండ‌గా అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ, ఇత‌ర పార్టీల నుంచి అభ్య‌ర్థుల‌ను ఇంకా ఖ‌రారు చేయ‌లేదు. మ‌రో వైపు గ‌తంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌మాజ్ వాది పార్టీ ఇత‌ర పార్టీల‌తో క‌లిసి పొత్తు కుదుర్చుకున్నాయి.

ఈసారి బ‌హుజ‌నుల నాయ‌కుడిగా గుర్తింపు పొందిన ములాయం సింగ్ యాద‌వ్ కు నివాళిగా ఎవ‌రైనా పోటీ చేస్తారా అన్న‌ది వేచి చూడాలి. ఇక కంచుకోట‌గా భావించే ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి డింపుల్ యాద‌వ్(Dimple Yadav) పోటీ చేయ‌డం ప్రాధాన్య‌త సంతరించుకుంది. ఇదిలా ఉండా డింపుల్ యాద‌వ్ 2009లో పాలిటిక్స్ లోకి వ‌చ్చింది.

ఆమెకు 44 ఏళ్లు. 2012, 2014లో ఎంపీగా గెలుపొందారు. కానీ 2019లో బీజేపీ చేతిలో ఓట‌మి పాల‌య్యారు.

Also Read : 11న జ్ఞాన‌వాపి కేసుపై సుప్రీం తుది తీర్పు

Leave A Reply

Your Email Id will not be published!