Dinesh Gunawardena : శ్రీ‌లంక ప్ర‌ధానిగా దినేష్ గుణ‌వ‌ర్ద‌న‌

ప్రమాణ స్వీకారం చేయించిన ప్రెసిడెంట్

Dinesh Gunawardena : శ్రీ‌లంక‌లో సంక్షోభం స‌మ‌సి పోలేదు. మ‌రింత పెరిగింది. ప్ర‌ధాన మంత్రిగా ఉన్న ర‌ణిలె విక్ర‌మ‌సింఘే దేశానికి నూత‌న అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న స్థానంలో ఉన్న గోట‌బ‌య రాజ‌ప‌క్సే దేశం విడిచి పారి పోయాడు.

మ‌రో సోద‌రుడు మ‌హీంద రాజ‌ప‌క్సే ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి నేవీ, ఆర్మీ క్యాంపులో త‌ల‌దాచుకున్నాడు. ఈ త‌రుణంలో విక్ర‌మ సింఘే గోట‌బ‌య మ‌నిషి అంటూ లంకేయులు నిప్పులు చెరుగుతున్నారు.

త‌ను అధ్య‌క్ష ప‌ద‌వి నుండి దిగి పోవాలంటూ ఆందోళ‌న బాట ప‌ట్టారు. ఈ స‌మ‌యంలో నిన్న అర్ధ‌రాత్రి ఉన్న‌ట్టుండి ఆందోళ‌న‌కారుల‌పై దాడుల‌కు దిగాయి శ్రీ‌లంక పోలీసు బ‌ల‌గాలు.

దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తమైంది అంత‌టా. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. తీవ్ర ఆర్థిక‌, ఆహార సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న శ్రీ‌లంక దేశానికి కొత్త ప్ర‌ధాన మంత్రిగా దినేష్ గుణ‌వ‌ర్ద‌న(Dinesh Gunawardena) ప్ర‌మాణ స్వీకారం చేశారు.

దేశ అధ్య‌క్షుడు ర‌ణిలె విక్ర‌మ‌సింఘే స‌మ‌క్షంలో పాదుజ‌న పెర‌మున పార్టీకి చెందిన మాజీ మంత్రి దినేష్ గుణ వ‌ర్ద‌న ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండ‌గా గ‌తంలో గోట‌బ‌య రాజ‌ప‌క్సే దినేష గుణ వ‌ర్ద‌నను హోం శాఖ మంత్రిగా నియ‌మించారు.

ఈ మేర‌కు ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యాన్ని శ్రీ‌లంక ప్ర‌భుత్వ కార్యాల‌యం వెల్ల‌డించింది. మిగిలిన మంత్రి వ‌ర్గం త్వ‌ర‌లోనే ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది స‌ర్కార్.

ఓ వైపు ఆందోళ‌న‌కారుల‌పై దాడులు కొన‌సాగుతుండ‌గానే మ‌రో వైపు ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంపై నిర‌స‌నలు మిన్నంటాయి.

Also Read : ముదిరిన సంక్షోభం ఖాకీల ఉక్కుపాదం

Leave A Reply

Your Email Id will not be published!