Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్ లోని ఫతేఘర్ సాహిబ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
రాష్ట్రానికి సంబంధించి మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పై మండిపడ్డారు. ఆయనను ఎందుకు తొలగించామో ప్రజలకు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని చెప్పాం.
కానీ మాజీ సీఎం ఒప్పు కోలేదన్నారు. తనకు విద్యుత్ సరఫరాకు సంబంధించిన సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయని దానిని అమలు చేయలేమని చెప్పారని తెలిపారు.
పేదలకు ఉచిత విద్యుత్ వద్దన్నందుకే తాము కెప్టెన్ ను సీఎం పదవి నుంచి తొలగించామని చెప్పారు రాహుల్ గాంధీ(Rahul Gandhi ). తనకు కాంట్రాక్టు ఉందని చెప్పినందుకే వద్దని చెప్పామన్నారు.
రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి గురించి కూడా ప్రస్తావించారు. మాదక ద్రవ్యాలకు దేశానికి ముప్పు అని తాను పదే పదే చెబుతూనే ఉన్నానని అన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi ). ప్రయోగాలకు పంజాబ్ రాష్ట్రం వేదిక కాదని స్పష్టం చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. ఇక బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటూ పోతున్నారని , ఎన్నడూ లేని రీతిలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగినా ప్రధాన మంత్రి పట్టించు కోవడం లేదన్నారు.
ఇద్దరు లేదా ముగ్గురు వ్యాపారవేత్తలకు అనుగుణంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు.
Also Read : కాంగ్రెస్ లో కుటుంబ పోరు లేదు