DJ Tillu Movie : ‘డీజే టిల్లు’ అదుర్స్ సిద్దూ సూప‌ర్

మ‌రింత హైప్ పెంచిన మూవీ

DJ Tillu Movie : ఊహించ‌ని రీతిలో పాపుల‌ర్ అయి పోయాడు సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌. గ‌తంలో కొన్ని సినిమాల‌లో న‌టించినా డీజే టిల్లు మూవీలోని(DJ Tillu Movie) డైలాగులు, ఒక్క పాట‌తో సూప‌ర్ హీరోల స్థాయికి చేరుకున్నాడు.

హిందీలో ర‌ణ్ బీర్ కపూర్ ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే ఈ సిద్దూ అద్భుత‌మైన మేన‌రిజం ఉన్న హీరోగా చెప్ప‌డంలో త‌ప్పు లేదు. బాగా పుస్త‌కాలు చ‌దవ‌డం, మాట‌ల్లో స్పార్క్ ఉండేలా చేయ‌డంలో త‌న‌కు తానే సాటి. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది డీజే టిల్లు(DJ Tillu Movie) సాంగ్ .రికార్డుల‌ను బ్రేక్ చేసేలా ఉంది.

ఇవాళ సిద్దూ న‌టించిన డీజే టిల్లు విడుద‌లైంది. మంచి టాక్ వ‌చ్చింది. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రానికి విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ద‌ర్శ‌కుడు క‌థ రాస్తే సిద్దూ సినిమాలో డైలాగులు రాశాడు. ఇప్ప‌టికే మూవీ మాట‌లు హ‌త్తుకునేలా ఉన్నాయి. సినిమాపై హైప్ పెంచేలా చేశాయి. స్క్రిప్ట్ విష‌యంలో కొంత స‌ల‌హా ఇచ్చిన త్రివిక్రం శ్రీ‌నివాస్ చిత్రం త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుందన్న కామెంట్ చేశాడు.

రిలీజైన పాట‌లు, పంచ్ డైలాగులు దుమ్ము రేపుతున్నాయి. సితార ఎంట‌ర్ టైన్మెంట్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన డీజే టిల్లు ఇవాళ విడుద‌లైంది.

ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ చూసిన ప్రేక్ష‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌పై త‌మ అభిప్రాయాల‌ను పంచుకుంటున్నారు. ఫ‌స్టాఫ్ అదిరంది అంటున్నారు.

సెకండాఫ్ కొంచెం స్లోగా ఉంద‌న్న‌ప్ప‌టికీ మూవీ మాత్రం సూప‌ర్ అంటున్నారు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే డీజే టిల్లును సిద్దూ ఒక్క‌డే ఒన్ మ్యాన్ షో న‌డిపించాడు.

Also Read : ఆడ‌వాళ్లు మీకు జోహార్లు’ సూప‌ర్

Leave A Reply

Your Email Id will not be published!