DJ Tillu Movie : ‘డిజే టిల్లు’ మూవీ రెస్పాన్స్ అదుర్స్

డైరెక్ట‌ర్ విమ‌ల్ కృష్ణ హ్యాపీ

DJ Tillu Movie : మూవీ మేకింగ్ లో కొత్త‌ద‌నం క‌నిపించేలా ప్ర‌య‌త్నం చేసిన ద‌ర్శకుడు విమ‌ల్ కృష్ణ‌. క్రేజీ రొమాంటిక్ కామెడీగా రూపొందించాడు. విడుద‌లై మూవీ ట్రైల‌ర్ కు ఫుల్ రెస్పాన్స్ వ‌చ్చింది.

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఈ చిత్రానికి స‌హ‌కారం అందించ‌డం విశేషం. ఇందులో న‌టించిన సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ స్కిప్ట్ పై త్రివిక్ర‌మ్ ప్ర‌భావం ఉంద‌న్నాడు. రాసిన వాటిలో చాలా మార్పులు చేశాడ‌న్నారు.

దీంతో ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డం ఖాయ‌మ‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నాడు. సిద్దు కూడా డైలాగ్స్ రాశాడు. సితార ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ డీజే టిల్లు(DJ Tillu Movie), భీమ్లా నాయ‌క్ నిర్మించారు.

ఇప్పటికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న ఆ సినిమాకు కూడా ర‌చ‌నా స‌హ‌కారం అందిస్తున్న త్రివిక్ర‌మ్ ఇప్పుడు డీజే టిల్లుకు కూడా మ‌ద్దతు ఇవ్వ‌డం విశేషం. అందుకే ఈ మూవీపై భారీ న‌మ్మ‌కాన్ని పెట్టుకున్నారు ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ‌,

న‌టుడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌. ఇక డీజే టిల్లు మూవీలో నేహా శెట్టి, ప్రిన్స్ సెసిల్, బ్ర‌హ్మాజీ, త‌దిత‌రులు న‌టించారు. శ్రీ చ‌ర‌ణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఇదిలా ఉండ‌గా ఇది పూర్తిగా రొమాంటిక్ సినిమాయే అని కొంద‌రు అనుకుంటున్నారు. దీనిపై స్పందించాడు విమ‌ల్ కృష్ణ‌. సినిమాలో క‌థ‌ను బ‌ట్టి కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయంతే.

అయితే అవి హ‌ద్దులు దాట‌వ‌న్నాడు ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ‌.ఈ డీజే టిల్లు మూవీ ఈనెల 12న రిలీజ్ కానుంది. విమ‌ల్ కృష్ణ గ‌తంలో కొన్ని షార్ట్ ఫిలింలు తీశాడు. ఒక‌టి రెండు సినిమాల్లో కూడా న‌టించాడు. తాను క‌థ రాస్తే సిద్దు డైలాగులు రాశాడ‌న్నాడు.

Also Read : ‘ఆరిఫ్’ మెలోడీ పాట‌ల బాట‌సారి

Leave A Reply

Your Email Id will not be published!