DK Shiva Kumar : ఈడీ తాజా సమన్లపై డీకే కామెంట్స్
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ గరం గరం
DK Shiva Kumar : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్(DK Shiva Kumar) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయనకు కేంద్ర దర్యాప్తు సంస్థ మరోసారి సమన్లు జారీ చేసింది. దీనిపై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తమిళనాడులో ప్రారంభమై కేరళ మీదుగా పూర్తి చేసుకుని ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది.
ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ప్రత్యేకంగా కర్ణాటకలో ఉన్నారు. తనయుడు చేపట్టిన జోడో యాత్రలో పాల్గొన్నారు మేడం. తనకు పదే పదే ఈడీ నోటీసులు జారీ చేయడం , సమన్లు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థ పరిమితులు ఏమిటో ఇప్పటి వరకు తెలుసుకోక పోవడం దారుణమన్నారు.
తనకు ఎన్ని సమన్లు పంపినా భయపడనని స్పష్టం చేశారు డీకే శివకుమార్(DK Shiva Kumar). ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సర్కార్లు కావాలని వేధింపులకు పాల్పడుతున్నాయని ఏదో ఒకరోజు తమకు కూడా అధికారం వస్తుందన్నారు.
యుద్దభూమిలో రాజకీయ పోరాటాలు జరగాలని ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తే ఓటర్లు తగిన రీతిలో గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది మేలో శివకుమార్ తో పాటు ఇతరులపై మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
శుక్రవారం ఆయన తీవ్రంగా స్పందించారు. తాను కోరిన పత్రాలను సమర్పించానని విచారణ కోసం ఎప్పుడైనా హాజరయ్యేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు కర్ణాటక పీసీసీ చీఫ్.
Also Read : ప్రమాదంలో దేశ ఆర్థిక వ్యవస్థ – చిదంబరం