DK Shiva Kumar : ప్రమాణ స్వీకారం అందరికీ ఆహ్వానం
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పిలుపు
DK Shiva Kumar : కర్ణాటకలో భారీ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం మే 20 శనివారం కొలువు తీరనుంది. ఈ మేరకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సీఎం ఎవరనేది క్లారిటీ ఇచ్చేసింది ఏఐసీసీ.
తాజాగా రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 224 సీట్లకు గాను 136 సీట్లు గెలుచుకుని ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం గా డీకే శివ కుమార్(DK Shiva Kumar) ను ఖరారు చేసింది అధిష్టానం. సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి పవర్ లోకి రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సంబురాలు అంబురాన్ని చేరుకున్నాయి.
ఇదిలా ఉండగా కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భారీ ఎత్తున జనం హాజరు కానున్నారని అంచనా. ఇదిలా ఉండగా రేపటి ప్రోగ్రాంకు రాష్ట్రం నలుమూలల నుండి తరలి రావాలని పిలుపునిచ్చారు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్.
ఈమేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అఖండ కర్ణాటక ఎంతో ఆసక్తితో ఈ రోజు కోసం ఎదురు చూస్తోందన్నారు. తమను ఆశీర్వదించి అద్భుత విజయాన్ని కట్టబెట్టినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Also Read : KTR Aero Space