DK Shiva Kumar : తెలంగాణలో కాంగ్రెస్ విప్లవం
విజయం మాదేనన్న డీకే శివకుమార్
DK Shiva Kumar : కర్ణాటక – డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జనాదరణ రోజురోజుకు పెరుగుతోందన్నారు. ఇక అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు షాక్ తప్పదన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కేసీఆర్ ఇక నుంచి ఫామ్ హౌస్ కు పరిమితం కావడమే మిగిలి ఉందన్నారు డీకే శివకుమార్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.
DK Shiva Kumar Comments Viral
తెలంగాణలో ఎవరూ ఊహించని రీతిలో ప్రజా విప్లవం రాబోతోందని జోష్యం చెప్పారు. దీనిని ఎవరూ అడ్డు కోలేరని పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం వస్తుందన్నారు. కాంగ్రెస్ జెండా అజెండా మొత్తం దేశం కోసమేనని పేర్కొన్నారు .
ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమేనని, ఇది కేవలం తమ పార్టీ వల్లనే అవుతుందని చెప్పారు డీకే శివకుమార్(DK Shiva Kumar). రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తుందన్నారు. రాబోయే ఆరు నెలల కాలంలో మార్పు దేశ వ్యాప్తంగా రాబోతోందని అన్నారు. దీనిని ఎవరూ అంచనా వేయలేరని అన్నారు.
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ, తెలంగాణలో ప్రస్తుతం పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ఎద్దేవా చేశారు డీకే శివకుమార్.
Also Read : PM Modi Announce : ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం