DK Shiva Kumar : జార్కిహోళీని అరెస్ట్ చేయండి – డీకే
విచారణ జరిపించాలని డిమాండ్
DK Shiva Kumar : కర్ణాటకలో రాజకీయం మరింత ముదురుతోంది. అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యద్దం కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి రమస్ జార్కి హోళీ సంచలన కామెంట్స్ చేశారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒటుకు రూ. 6, 000 వేలు ఇస్తామంటూ బహిరంగ ప్రకటన చేశారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దేశ వ్యాప్తంగా వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజాస్వామ్య దేశంలో ఒక మాజీ మంత్రి ఇలా బరితెగించి మాట్లాడటం ఎంత వరకు సబబు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. దీంతో పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుందని గ్రహించింది కర్ణాటక భారతీయ జనతా పార్టీ. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెంటనే స్పందించారు.
మాజీ మంత్రి రమేష్ జార్కి హొళి చేసిన వ్యాఖ్యలు పార్టీకి సంబంధించినవి కావని పేర్కొన్నారు. ఆయన వ్యక్తిగతమని పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ తరుణంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్(DK Shiva Kumar) , సీఎల్పీ చీఫ్, మాజీ సీఎం సిద్దరామయ్య ఆధ్వర్యంలో పోలీసులకు మాజీ మంత్రిపై ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఓటర్లను బీజేపీ ఒక్కొక్కరికి రూ. 6, 000 చొప్పున 30, 000 వేల కోట్ల లంచంతో కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నారంటూ ఆరోపించారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు డీకే శివకుమార్.
Also Read : సాకేత్ గోఖలే కు షాక్ ఈడీ అరెస్ట్