DK Shiva Kumar : అన్నీ తానైన డీకే శివకుమార్
తెలంగాణ పాలిటిక్స్ పై ముద్ర
DK Shiva Kumar : హైదరాబాద్ – నిన్న కర్ణాటకలో ట్రబుల్ షూటర్ గా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీని పవర్ లోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు కేపీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాజాగా తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా కొలువు తీరిన దొర సర్కార్ ను సాగనంపడంలో వెనుక ఉంటూ కీలకంగా వ్యవహరించారు.
DK Shiva Kumar Rules
ఇదే సమయంలో ముందు నుంచీ వ్యూహాలు పన్నడంలో, సీనియర్లను, నేతలను కలపడంలో, సమన్వయం చేయడంలో ముద్ర కనబర్చారు డీకే శివకుమార్. ఎవరూ ఊహించని రీతిలో జనం కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ఏకంగా 64 సీట్లు కట్టబెట్టారు. మిత్రపక్షం పార్టీ సీపీఐ నుంచి ఒకరు గెలుపొందారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేయడం. వారితో ఏకాభిప్రాయం కుదిరేలా సీఎం ఎంపిక విషయంలో కీలకంగా ఉన్నారు డిప్యూటీ సీఎం. మొత్తంగా బీఆర్ఎస్ సర్కార్ ను ఇంటికి సాగనంపడంలో ముఖ్య పాత్ర పోషించారని చెప్పడంలో అతిశ యోక్తి లేదు. డీకే(DK Shiva Kumar) ముందు నుంచీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచారు. ఆయనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేశారు.
ఇక తాజా ఎన్నికలకు సంబంధించి చూస్తే కాంగ్రెస్ పార్టీ 39.4 శాతం ఓట్లతో 64 సీట్లు సాధించింది. ఇక బీఆర్ఎస్ 37.34 శాతంతో 34 సీట్లు కైవసం చేసుకుంది. ఇక బీజేపీ 13.9 శాతం ఓట్లతో 8 సీట్లు పొందింది. 2.2 శాతంతో 7 సీట్లు గెలుపొందింది ఎంఐఎం. సీపీఐ ఒక సీటుతో సరి పెట్టుకుంది.
Also Read : AP CM YS Jagan : అంతటా అప్రమత్తంగా ఉండాలి