DK Shiva Kumar : క‌ర్ణాట‌క కోసం క‌లిసి సాగుతాం – డీకే

స్ప‌ష్టం చేసిన కేపీసీసీ చీఫ్ కామెంట్స్

DK Shiva Kumar : నిన్న‌టి దాకా సీఎం రేసులో ఉన్న క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్‌, ట్రబుల్ షూట‌ర్ గా పేరు పొందిన డీకే శివ‌కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా గురువారం ఆయ‌న స్పందించారు. ఇవాళ సాయంత్రం సీఎల్పీ నేత‌గా మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌ను ఎన్నుకోనున్నారు. గ‌త నాలుగు రోజులుగా సీఎం పోస్టు ఎవ‌రికి ద‌క్కుతుంద‌నే దానిపై ఉత్కంఠకు తెర‌దించే ప్ర‌య‌త్నం చేసింది సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ.

ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, మాజీ చీఫ్ లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డ్డారు. సీఎం రేసులో ఉన్న సిద్ద‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్ మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేందుకు నానా తంటాలు ప‌డ్డారు. చివ‌ర‌కు ఒప్పుకోలేదు డీకేఎస్. ఈ మ‌ధ్య‌లో డీకే పార్టీనీ వీడుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు. తాను చ‌ని పోయేంత వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌కు పార్టీ త‌ల్లి లాంటిద‌ని చెప్పారు. ఇంకోసారి త‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తే ప‌రువు న‌ష్టం కేసు వేస్తాన‌ని హెచ్చరించారు.

ఎంత‌కూ ఒప్పుకోక పోవ‌డంతో డీకే శివ‌కుమార్ ను బుజ్జ‌గించేందుకు రంగంలోకి స్వ‌యంగా దిగారు సోనియా గాంధీ. ఆమె అంటే డీకేకు ఎన‌లేని గౌర‌వం. అంత‌కు మించిన అభిమానం. దీంతో సోనియా మాట‌ల‌ను కాద‌న‌లేక పోయారు కేపీసీసీ చీఫ్‌. ఈ సంద‌ర్బంగా ఏఐసీసీ చీఫ్ తో సిద్ద‌రామ‌య్య‌తో క‌లిశారు డీకే శివ‌కుమార్. క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల కోసం క‌లిసి సాగుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Komatireddy Rajagopal Reddy

Leave A Reply

Your Email Id will not be published!