DK Shiva Kumar : ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ – డీకే

ఎమ్మెల్యేల శిక్ష‌ణా శిబిరంలో

DK Shiva Kumar : క‌ర్ణాట‌క డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ డీకే శివ‌కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు. ఇవాళ రాష్ట్ర ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీపై న‌మ్మ‌కం ఉంచి అధికారాన్ని క‌ట్ట‌బెట్టార‌ని గుర్తు చేశారు.

క‌ర్ణాట‌క‌లో లోని నెల‌మంగ‌ళ లోని ధ‌ర్మ‌స్థ‌ల క్షేమ భ‌వ‌నంలో శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేల‌కు ఇందులో వివిధ అంశాల‌పై శిక్ష‌ణ ఇచ్చారు. వారి పాత్ర‌, ఎమ్మెల్యేల‌కు ఉన్న బాధ్య‌త‌లు, విధులు ఏమిటో తెలుసుకునేలా ఇందులో త‌ర్ఫీదు పొందేలా చేశారు.

ఈ శిక్ష‌ణా శిబిరానికి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు డిప్యూటీ చీఫ్ మినిష్ట‌ర్ డీకే శివ‌కుమార్(DK Shiva Kumar). ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కావాల‌ని రాళ్లు వేయాల‌ని చూస్తుంద‌ని, కానీ వాటి నుంచి ఎలా ఎదుర్కోవాల‌నే దానిపై కూడా ప‌ట్టు క‌లిగి ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి పూర్తి స‌మాచారం క‌లిగి ఉండాల‌ని పేర్కొన్నారు. ఏ మాత్రం అజాగ్ర‌త్త‌తో ఉన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

ప్ర‌భుత్వం కొత్త ఎమ్మెల్యేల‌కు అండ‌గా ఉంటుంద‌ని అన్నారు డీకే శివ‌కుమార్. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఎప్పుడైనా త‌న‌తో సీఎం సిద్ద‌రామ‌య్య‌తో మాట్లాడ వ‌చ్చ‌ని తెలిపారు. ఎలాంటి మొహ‌మాటం లేకుండా ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఉండాల‌ని వారికి అండ‌గా ఉంటూ సేవ‌లు అందించాల‌ని పేర్కొన్నారు డీకే శివ‌కుమార్.

Also Read : Kamal Haasan Joins : ప్రాజెక్ట్ – కె షూటింగ్ లో క‌మ‌ల్ హాసన్

 

Leave A Reply

Your Email Id will not be published!