DK Shiva Kumar : ప్ర‌జ‌లు దేవుళ్లు..ప్ర‌భువులు – డీకే శివ‌కుమార్

ప్ర‌తి ఒక్క‌రికి మేలు చేకూర్చేలా కృషి

DK Shiva Kumar : ప్ర‌జ‌లు ఇచ్చిన అద్భుత‌మైన తీర్పున‌కు క‌ట్టుబ‌డి ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. శుక్ర‌వారం బెంగ‌ళూరు లోని టౌన్ హాల్ లో భీమా సంక‌ల్ప స‌దస్సులో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. 2023లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 224 సీట్ల‌కు గాను 135 సీట్లు క‌ట్ట‌బెట్టార‌ని ఇదంతా మీ వ‌ల్ల‌నే జ‌రిగింద‌న్నారు డీకే శివ‌కుమార్. విశేషంగా కృషి చేసిన మీ అంద‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని చెప్పారు. ద‌ళిత సంఘ‌ర్ష‌ణ స‌మితి కార్య‌క‌ర్త‌ల‌ను డీకేఎస్ స‌న్మానించారు.

ఎన్నిక‌ల సంద‌ర్బంగా తాము ఇచ్చిన ఐదు కీల‌క హామీల‌ను అమ‌లు చేస్తామ‌ని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా ఎదుర్కొంటామ‌ని అన్నారు డీకే శివ‌కుమార్(DK Shiva Kumar). అవినీతి, అక్ర‌మార్కుల‌కు చోటు లేద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు బాధ్య‌త‌గా ప‌ని చేయాల‌ని, ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా చూడాల‌ని కోరారు.

కార్య‌క‌ర్త‌లే పార్టీకి ప‌ట్టు కొమ్మ‌ల‌ని , వారి సహ‌కారం మ‌రిచి పోలేన‌న్నారు. అఖండ‌మైన మెజారిటీ రావ‌డానికి మీరంతా క‌లిసి క‌ట్టుగా చేసిన కృషి అన్నారు. ఏ పార్టీపై ఆధార ప‌డ‌కుండా తాము స్వంతంగా ప‌వ‌ర్ లోకి వ‌చ్చామ‌ని ఇదంతా రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రి స‌హ‌కారం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు. ఇదే స‌మ‌యంలో అన్ని వ‌ర్గాల పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేందుకు త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని చెప్పారు డీకే శివ‌కుమార్.

Also Read : YS Sharmila KCR : సీఎం నిర్వాకం నిరుద్యోగుల‌కు శాపం

Leave A Reply

Your Email Id will not be published!