DK Shiva Kumar : ‘అన్నభాగ్య’ను అడ్డుకుంటే ఊరుకోం
నిప్పులు చెరిగిన డిప్యూటీ సీఎం శివకుమార్
DK Shiva Kumar : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు చెదిన ప్రతి ఒక్కరికీ 10 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందించే అన్న భాగ్య పథకాన్ని కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. దీనిపై నిరసిస్తూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం బెంగళూరులోని ఫ్రీడం పార్కు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shiva Kumar).
ఆనాడు మన్మోమోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆహార భద్రత చట్టం తీసుకు వచ్చిందన్నారు. ఈ చట్టం వల్ల ప్రతి ఒక్కరికీ ఆహార హక్కుగా అమలులోకి వచ్చిన విషయం నేటి మోదీకి తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తోందన్నారు.
కాగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కోలుకోలేని రీతిలో ప్రజలు షాక్ ఇచ్చారని దీంతో తట్టుకోలేక కేంద్రం తమకు అడ్డు తగులుతోందని ఆరోపించారు. పేదలకు బియ్యాన్ని పంపిణీ చేయడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఆరు నూరైనా సరే అన్న భాగ్య పథకాన్ని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు డీకే శివకుమార్. మోదీ ఆటలు తమ వద్ద సాగవని హెచ్చరించారు.
Also Read : Congress Slams : మణిపూర్ లో హింస ఇంకెంత కాలం