DK Shiva Kumar : శివాచార్య‌ను ద‌ర్శించుకున్న డీకే

కేదార్ పీఠానికి పీఠాధిప‌తి

DK Shiva Kumar : బెంగ‌ళూర్ లోని ఆర్ఆర్ న‌గ‌ర్ లో ఉన్న కేదార్ పీఠం పీఠాధిప‌ది జ‌ద‌గ్గురు శ్రీ భీమ శంక‌ర్ లింగ శివాచార్య మ‌హా స్వామీజీని క‌లుసుకున్నారు క‌ర్ణాట‌క ఉప ముఖ్య మంత్రి డీకే శివ‌కుమార్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఆశీస్సులు అందించారు. రాష్ట్రంలో ఎక్కువ‌గా పీఠాలు ఉన్నాయి. ధార్మిక కార్య‌క్ర‌మాల‌తో పాటు స‌మాజానికి ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డేలా చేస్తున్నాయి. ప్ర‌ధానంగా ఎక్కువ‌గా ఈ పీఠాలు , పీఠాధిప‌తులు విద్యా రంగానికి సేవ‌లు అంద‌జేస్తున్నాయి.

ఇందులో భాగంగా ఏ పార్టీ గెలుపొందినా ముందుగా పీఠాల‌ను సంద‌ర్శించాల్సిందే. ఇక్క‌డ ప్ర‌ధానంగా లింగాయ‌త్ సామాజిక వ‌ర్గం కీల‌క పాత్ర పోషిస్తుంది. వారు ఎవ‌రి వైపు మొగ్గు చూపితే వారే , ఆ పార్టీనే క‌ర్ణాట‌క‌లో అధికారంలోకి వ‌స్తుంది. ఈ సారి లింగాయ‌త్ లు గంప గుత్త‌గా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. గ‌తంలో కొలువు తీరిన బొమ్మై స‌ర్కార్ ఆశించిన మేర స‌హ‌కారం అందించ‌లేద‌ని గుర్రుగా ఉన్నారు ఆయా పీఠాల స్వాములు.

దీంతో వారు క‌న్నెర్ర చేయ‌డం ఒక్క లింగాయ‌త్ సామాజిక వ‌ర్గానికి చెందిన క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ , డిప్యూటీ సీఎం గా డీకే శివ‌కుమార్(DK Shiva Kumar) కొలువు తీర‌డం జ‌రిగింది. సీఎంగా సిద్ద‌రామ‌య్య ఆసీనుల‌య్యారు. ప్ర‌స్తుతం రాష్ట్రానికి చెందిన కీల‌కమైన పీఠాధిప‌తులు ఒక్క‌రొక్క‌రుగా డీకేను క‌లుస్తున్నారు. ఇదే స‌మ‌యంలో డీకేతో పాటు సీఎం సిద్ద‌రామ‌య్య ఆశీర్వాదాలు అందుకుంటున్నారు.

Also Read : TTD JEO : విస్తృతంగా టీటీడీ ప‌రిశోధ‌న‌లు – జేఈవో

Leave A Reply

Your Email Id will not be published!