DK Shivakumar : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ సీరియస్ అయ్యారు. ఆయన మరోసారి సీఎం బస్వరాజ్ బొమ్మై పై మండిపడ్డారు. తాజాగా చోటు చేసుకున్న పోలీస సబ్ ఇన్స్ పెక్టర్ (పీఎస్ఐ) రిక్రూట్ మెంట్ స్కామ్ పై స్పందించారు.
ఈ అంశంపై ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారంటూ డీకే శివకుమార్ ఆరోపించారు. తాము అధికారంలో లేం. పీఎస్ఐ స్కాం గురించి ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు.
స్కాం జరిగిందని ఆరోపణలు వస్తున్న తరుణంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి, ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎందుకు చెప్పారని ప్రశ్నించారు.
నిత్యం అబద్దాలకు కేరాఫ్ గా బొమ్మై సర్కార్ మారిందని మండిపడ్డారు. ఈ స్కాం వ్యవహారానికి సీఎం బాధ్యత వహించాలని అన్నారు డీకే శివకుమార్(DK Shivakumar). అంతా జరిగాక ఇప్పుడు కేసును సీఐడీకి ఎందుకు అప్పగించారంటూ నిలదీశారు.
ఇదిలా ఉండగా కర్ణాటక పీఎస్ఐ కుంభకోణంలో ప్రధాన నిందితుడగా భావించిన మహారాష్ట్రకు చెందిన రుద్రగౌడ డి పాటిల్ ను నేర పరిశోధన విభాగం (సీఐడీ) అదుపులోకి తీసుకుంది.
ఆయనను అర్ధరాత్రి తన ఆఫీసుకు రావడంపై ప్రశ్నించారు డీకే శివకుమార్. రాష్ట్రంలో పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ల నియామకాల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి ఈ కేసు నమోదైంది.
పీసీఐ రిక్రూట్ మెంట్ కుంభకోణానికి సంబంధించిన ప్రతి దాన్ని క్షుణ్ణంగా విచారిస్తామని, దోషులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పరీక్షలో పాసైన అభ్యర్థులను కూడా విచారిస్తామని, సమగ్ర విచారణ జరుపుతామని బొమ్మై చెప్పడాన్ని తప్పుపట్టారు డీకే శివకుమార్.
Also Read : సిలబస్ మార్పుపై రాహుల్ సీరియస్