DMK Delhi Office : దేశ రాజధాని హస్తినలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. డీఎంకేకు చెందిన పార్టీ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ తో పాటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకే ఎంపీలు(DMK Delhi Office )హాజరు కావడం విశేషం.
డీఎంకే ఆఫీసులో ఓ విభాగానికి సోనియా గాంధీ రిబ్బర్ కట్ చేసి ప్రారంభించారు. డీఎంకే కార్యాలయానికి(DMK Delhi Office )అన్నా కళైంజర్ అరివాలయం అని తమిళంలో పేరు పెట్టారు.
ఈ కార్యక్రమానికి సోనియా గాంధీతో పాటు సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ , సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన ఫరూక్ అబ్దుల్లా సహా ప్రతిపక్ష పారట్ఈల నేతలు ఢిల్లీలోని డీఎంకే ఆఫీస్ ప్రారంభోత్సవంలో ఒక వేదికపైకి వచ్చారు.
ఈ ఆఫీసు కార్యక్రమంలో ప్రముఖులతో పాటు టీఎంసీ, టీడీపీ, సీపీఐ, బీజేడీ , ఎస్ఎడి నాయకులు, ప్రముఖులు కూడా హాజరయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్, డీఎంకే కూటమిగా ఉన్నాయి.
గత ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయి. హాజరైన ప్రముఖుల్లో టీఎంసీకి చెందిన ఎంపీ మహువా మోయిత్రా, టీడీపీ తరపున ఎంపీ రామ్మోహన్ నాయుడు, కే. రవీంద్ర కుమార్ , సీపీఐ నుంచి డి. రాజా, బీజేడీ నుంచి అమర్ పట్నాయక్ , ఎస్ఏడీ నుంచి హర్సిమత్ బాదల్ కూడా హాజరయ్యారు.
తమిళనాడు ప్రభుత్వంలోని మంత్రులు, ఉభయ సభలకు చెందిన డీఎంకే ఎంపీలు పాల్గొన్నారు. అతిరథ మహారథులు హాజరు కావడం ప్రత్యేకతను సంతరించుకుంది.
Also Read : పదవులపై పవార్ వైరాగ్యం