CJI DY Chandrachud : నా అధికారంతో చెలగాటం ఆడొద్దు
న్యాయవాది నిర్వాకం సీజేఐ ఆగ్రహం
CJI DY Chandrachud : ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ కు కోపం వచ్చింది. ఓ న్యాయవాది పదే పదే విసిగించడంపై భగ్గుమన్నారు. ఓ కేసు విషయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతే కాదు నా అధికారంతో చెలగాటం ఆడితే ఎలా అని నిలదీశారు. తన అభ్యర్థనను వేరే బెంచ్ ముందు లేవనెత్తుతానని లాయర్ సూచించారు. దీనిపై సీరియస్ గా స్పందించారు సీజేఐ. న్యాయవాది చేసిన సూచనపై జస్టిస్ చంద్రచూడ్ సీరియస్ గా స్పందించారు.
మంగళవారం తన పిటిషన్ కు ముందస్తు తేదీ కోసం ఒత్తిడి చేస్తున్న న్యాయవాదిపై విరుచుకు పడ్డారు సీజేఐ. ఈ కేసు ఏప్రిల్ 17న అని సీజేఐ చెప్పినప్పుడు న్యాయవాది సుప్రీంకోర్టును ముందస్తు విచారణకు అభ్యర్థించారు. మీరు అనుమతి ఇస్తే మరొక బెంచ్ ముందు చెప్పగలనంటూ పేర్కొన్నారు. ఈ సూచనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI DY Chandrachud).
నాతో ఈ మాయలు ఆడకండి. ఇక్కడ ప్రస్తావించి మరెక్కడైనా ముందు తేదీ గురించి ప్రస్తావించ వద్దని స్పష్టం చేశారు . దయచేసి నన్ను మన్నించండి..క్షమించండి అని వేడుకున్నారు సీజేఐ చంద్రచూడ్ ను. ఇదిలా ఉండగా ప్రతి రోజూ ఉదయం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వారి అత్యవసర జాబితా కోసం దాదాపు 100 కేసులను విచారిస్తుంది. ఇదే క్రమంలో సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ పై తీవ్ర స్థాయిలో హెచ్చరించారు సీజేఐ.
Also Read : అవినీతీపై యుద్దం ప్రభుత్వంపై ఆగ్రహం