Dominic Raab : బ్రిటన్ ఉప ప్రధానిగా డొమినిక్ రాబ్
పలువురు మంత్రులకు ఉద్వాసన
Dominic Raab : బ్రిటన్ ప్రధానమంత్రిగా కొలువు తీరిన భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తను పీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలువురు మంత్రులకు ఉద్వాసన పలికారు. ఉప ప్రధాన మంత్రిగా డొమినిక్ రాబ్(Dominic Raab) ను నియమించారు. మొత్తంగా తన మార్క్ ఏమిటో చూపించారు. ఇప్పటికే లిజ్ ట్రస్ కేబినెట్ లో పని చేస్తున్న వారిలో చాలా మందిని తప్పుకోవాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ సమయంలో దేశ హితం కోసం, ముఖ్యంగా ఆంగ్లేయుల బాగు కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి మీరంతా సహకరించాలని కోరుతున్నానని తన మొదటి ప్రసంగంలోనే స్పష్టం చేశారు రిషి సునక్. ఆర్థిక స్థిరత్వం , యోగ్యత తన ప్రభుత్వ ఎజెండాలో ముఖ్యమైన భాగంగా ఉంటుందన్నారు.
బకింగ్ హోం ప్యాలస్ లో కింగ్ చార్లెస్ ను కలుసుకున్నారు. ఆ వెంటనే పని వెంటనే ప్రారంభమవుతుందని ప్రకటించారు. రిషి సునక్ ప్రకటించినట్లుగానే ముందు కేబినెట్ లో ప్రక్షాళన ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే మౌనంగా ఉంటూనే తనదైన శైలిలో షాక్ ఇవ్వడం మొదలు పెట్టారు. గంట లోపే రిషి సునక్ ఆపరేషన్ మొదలు కావడం ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రధానంగా మాజీ పీఎం బోరిస్ జాన్సన్ కు ఇది కోలుకోలేని షాక్ అని చెప్పక తప్పదు. ఆర్థిక మంత్రిగా జెరెమీ హంట్ ను నియమించారు. హోం శాఖ రాష్ట్ర కార్యదర్శిగా సుయెల్లా బ్రేవర్ మాన్ ను చేర్చుకున్నారు. గత వారం ఆమె రాజీనామా చేశారు.
Also Read : అక్షత మూర్తి పంట పండింది