Donald Trump : డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్..రిలీజ్
ఎన్నికల్లో అక్రమాలపై ఆరోపణలు
Donald Trump : అమెరికా దేశ చరిత్రలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. 2020 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా అక్రమాలకు పాల్పడడం, రిజల్ట్స్ కు సంబంధించి జోక్యం చేసుకోవడం, కుట్రకు తెర లేపడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు డొనాల్డ్ ట్రంప్.
Donald Trump Arrested
ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. జడ్జి అరెస్ట్ కు ఆదేశాలు జారీ చేయడంతో గత్యంతరం లేక తనంతకు తానుగా అట్లాంటా ఫుల్టన్ కౌంటీ జైలు వద్ద పోలీసులకు తానే స్వయంగా లొంగి పోయారు డొనాల్డ్ ట్రంప్(Donald Trump). ఆయనను తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో అమెరికా అంతటా అప్రమత్తం అయ్యారు పోలీసులు.
జైలులో 20 నిమిషాల పాటు ఉన్నారు. అనంతరం 2 లక్షల డాలర్ల పూచీ కత్తుతో రిలీజ్ అయ్యారు. ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ పై ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదయ్యాయి. ఆయన ఈ మధ్య కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించారు కూడా.
తాను ఏ తప్పు చేయలేదని, ప్రభుత్వమే కావాలని తనపై కక్ష కట్టిందంటూ ఆరోపించారు ట్రంప్.
Also Read : Vemula Veeresham : కేసీఆర్ వ్యవహారం వీరేశం ఆగ్రహం