Donald Trump : ఎఫ్‌బీఐ దాడిపై భగ్గుమన్న డొనాల్డ్ ట్రంప్
సంచలన కామెంట్స్ చేసిన మాజీ యుఎస్ చీఫ్
Donald Trump : అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) షాకింగ్ కామెంట్స్ చేశారు. జోసెఫ్ బైడెన్ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
తన ఫ్లోరిడా హోమ్ పై ఎఫ్‌బీఐ దాడి చేసిందని, ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణి అంటూ మండిపడ్డారు ట్రంప్. ఇదిలా ఉండగా జార్జియా రాష్ట్రంలో 2020 లో జరిగిన ఓటింగ్ ఫలితాలను మార్చేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలపై కూడా విచారణ జరుగుతోంది.
ఇదిలా ఉండగా 2024 అధ్యక్ష ఎన్నికలకు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తన అభ్యర్థిత్వాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు. ఎఫ్బీఐ ఏజెంట్లు దాడి చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోషల్ మీడియా ట్రూత్ లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం కలకలం రేపింది.
ఇది ప్రాసిక్యూటోరియల్ దుష్ప్రవర్తన. న్యాయ వ్యవస్థ ఆయుధీకరణ , 2024లో నేను అధ్యక్ష పదవికి పోటీ చేయకూడదని తీవ్రంగా కోరుకునే రాడికల్ లెఫ్ట్ డెమోక్రాటక్ట దాడి అని ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా ట్రంప్ ఫ్లోరిడా నివాసంపై దాడి చేయడంపై వ్యాఖ్యానించేందుకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) నిరాకరించింది.
ఇదిలా ఉండగా నేషనల్ ఆర్కైవ్స్ ట్రంప్ కు చెందిన ఫ్లోరిడా నుండి 15 బాక్సుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించడం ప్రత్యేక చర్చకు దారి తీసింది.
Also Read : దండయాత్రకు చైనా సిద్దం తైవాన్ ఆగ్రహం