Donald Trump : 15న కీలక ప్రకటన చేస్తా – డొనాల్డ్ ట్రంప్
సంచలన కామెంట్స్ చేసిన మాజీ ప్రెసిడెంట్
Donald Trump : అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే వారం తాను కీలక ప్రకటన చేస్తానని ప్రకటించారు. దేని విషయం అనేది ఇప్పుడే చెప్పనని ఆరోజే వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2020లో ఆయన జోసెఫ్ బైడెన్ చేతిలో ఓటమి పాలయ్యారు.
తాను ఓడి పోలేదని డెమొక్రటిక్ పార్టీ గెలుపొందినట్లు ఆరోపణలు చేశారు. తాను ఓటమిని అంగీకరించే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు. ఆనాటి పరిస్థితుల్లో తాను ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్(Donald Trump). తాజాగా పరిస్థితులు మారడంతో మళ్లీ ఎన్నికల బరిలో ఉంటానని కుండ బద్దలు కొట్టారు.
తాను వచ్చే ఎన్నికల కోసం మళ్లీ రెడీ అవుతున్నానని చెప్పకనే చెప్పారు ట్రంప్. ఈ విషయాన్ని గత నెల రోజుల కిందట సంకేతాలు కూడా ఇచ్చారు. వచ్చే 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ వైట్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు డొనాల్డ్ ట్రంప్.
ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. ఆయన ప్రధానంగా గత కొంత కాలం నుంచి అధికారంలో ఉన్న బైడెన్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మరో వైపు నవంబర్ 15న ఫ్లోరిడా లోని పామ్ బీచ్ లోని మార్ ఎ లాగో సాక్షిగా బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నట్లు డిక్లేర్ చేశారు డొనాల్డ్ ట్రంప్.
ఇదిలా ఉండగా ట్రంప్ ఎలాంటి ప్రకటన చేస్తారని అమెరికన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read : ట్విట్టర్ యూజర్లకు మస్క్ వార్నింగ్