Donald Trump Ban Lift : ట్రంప్ కు ఊరట నిషేధం ఎత్తివేత
మెటా ఫేస్ బుక్ సంచలన నిర్ణయం
Donald Trump Ban Lift : అమెరికా మాజీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ కు ఊరట లభించింది. యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది సోషల్ మీడియా నుంచి. అమెరికా ప్రజలను హింస వైపు ప్రేరేపించేలా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేశారంటూ ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ , మెటా ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్ , లింక్డ్ ఇన్ , గూగుల్ యూట్యూబ్ , ఇలా ప్రతి సామాజిక మాధ్యమ సంస్థ ట్రంప్ ఖాతాలను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డొనాల్డ్ ట్రంప్. ఆ తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలయ్యారు. అమెరికా వైట్ హౌస్ లో జోసెఫ్ బైడెన్ నూతన అధ్యక్షుడిగా కొలువు తీరారు. దీంతో ట్రంప్ కు సంబంధించిన సామాజిక వ్యక్తిగత ఖాతాలను పూర్తిగా బ్యాన్ చేయడం హతాశుకు గురయ్యాడు.
ఆపై తీవ్ర స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తాను యుఎస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన వద్దకు అంతా వచ్చిన వారేనంటూ ఎద్దేవా చేశారు. అంతే కాకుండా వాటికి పోటీగా తానే సోషల్ మీడియాను ప్రారంభిస్తానని ప్రకటించారు. ఆ మేరకు ట్రూత్ సోషల్ ను రూపొందించారు. అయితే సీన్ మారింది.
ట్విట్టర్ ను ట్రంప్ స్నేహితుడు టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ కొనుగోలు చేశాడు. ఆ వెంటనే ఒపీనియన్ పోల్ చేపట్టి ట్రంప్ ఖాతాను పునరుద్దరించాడు. తాజాగా మార్క్ జుకర్ బర్గ్ సిఇఓగా ఉన్న ఫేస్ బుక్ సైతం ట్రంప్ పై(Donald Trump Ban Lift) విధించిన బ్యాన్ ను ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించాడు.
Also Read : అమ్మకానికి వాషింగ్టన్ పోస్ట్