Sudarshan Patnaik : ‘పూరీ ఒడ్డు’న ద్రౌపది ముర్ము సైకత శిల్పం
ఇసుకతో తీర్చి దిద్దిన సుదర్శన్ పట్నాయక్
Sudarshan Patnaik : భారత దేశంలో సైకత శిల్ప రూపకర్తగా పేరొందారు ఒడిశాకు చెందిన కళాకారుడు సుదర్శన్ పట్నాయక్(Sudarshan Patnaik). ఇదే రాష్ట్రానికి చెందిన ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ముకు అరుదైన అవకాశం వచ్చింది.
భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఈనెల 24న శుక్రవారం పార్లమెంట్ లో రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది.
ఆదివాసీ బిడ్డ. ఆమెకు గౌరవ సూచకంగా దేశం గర్వించదగిన సుదర్శన్ పట్నాయక్(Sudarshan Patnaik) ద్రౌపది ముర్ము సైకత (ఇసుక) శిల్పాన్ని తీర్చి దిద్దారు. ద్రౌపది ముర్ము సైకత శిల్పాన్ని చూసేందుకు పర్యాటకులు, స్థానికులు ఎగబడ్డారు.
ఈ శిల్పానికి సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చారు. అదే మేరా భారత్ మహాన్ అని జత చేసి సైకిత శిల్పాన్ని రూపొందించారు. పూరీ లోని బీచ్ లో ఇది హైలెట్ గా నిలిచింది.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదిలా ఉండగా ద్రౌపది ముర్ము పేద కుటుంబం నుంచి వచ్చారు. కష్టపడి చదువుకున్నారు. జూనియర్ అసిస్టెంట్ గా పని చేశారు.
పంచాయతీ కౌన్సిలర్ గా ఎన్నికైంది. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. జాతీయ స్థాయి నాయకురాలిగా పని చేశారు. రెండు సార్లు ఒడిశాలో మంత్రిగా పని చేశారు.
2015లో జార్ఖండ్ గవర్నర్ గా పని చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక విపక్షాల నుంచి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఉన్నారు.
ఇదిలా ఉండగా ఇవాళ దాఖలు చేసిన ముర్ము వెంట పీఎం మోదీ, మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ , నితిన్ గడ్కరీ, పీయూషీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, సీఎంలు యోగి, చౌహాన్ , ఖట్టర్ , బొమ్మై, భూపేంద్ర పటేల్ , బిస్వా శర్మ, ధామి, ప్రమోద్ సావంత్ , బీరేన్ సింగ్ ఉన్నారు.
Also Read : ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు
Best wishes to Presidential candidate Smt. #DroupadiMurmu Ji
My SandArt at Puri beach in Odisha. #MeraBharatMahan #PresidentialElections pic.twitter.com/BshkiGhlW3— Sudarsan Pattnaik (@sudarsansand) June 24, 2022