Dubai Prince Viral : దుబాయ్ ప్రిన్స్ సింప్లిసిటీలో స్పెష‌ల్

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

Dubai Prince Viral : దుబాయ్ ఈ ప‌దం వింటే చాలు చాలా మందికి ఒక్క‌సారైనా వెళ్లి చూడాల‌ని అనిపిస్తుంది. మ‌రి ఆ దేశానికి యువ‌రాజు అంటే మాట‌లా. కోట్లాది రూపాయ‌లు.

లెక్క‌కు మించిన ధ‌నం. ఆపై కోరుకుంటే క్ష‌ణాల్లో వాలిపోయే వ‌స‌తులు, సౌక‌ర్యాలు. కానీ ఈ యువ‌రాజు షేక్ హ‌జ్జాన్ బిన్ మ‌హ్మ‌ద్ అల్ ముక్తూమ్ వెరీ స్పెష‌ల్.

ఆయ‌న ఎప్పుడైతే కొలువు తీరాడో ఆనాటి నుంచి దుబాయ్ లో కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి. అపరిమిత‌మైన స్వేచ్ఛ‌ను క‌ల్పించాడు.

ఆయ‌న ఉన్న‌త‌మైన విద్య‌ను చ‌దువుకున్నాడు. దేశం అభివృద్ది చెందాలంటే కొంత మారాల‌ని గ్ర‌హించాడు. ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌యారిటీ ఇచ్చాడు.

మ‌హిళ‌లు ఇంట్లో ఉంటే ఏం లాభం. బ‌య‌ట‌కు రావాల‌ని, పురుషుల‌తో స‌మానంగా మీరు కూడా అభివృద్ది చెందాల‌ని ఆకాంక్షించాడు. ఆపై టెక్నాల‌జీని విస్త‌రించాడు.

విద్య‌, వైద్యం, ప‌ర్యాట‌కం, నిర్మాణ రంగం, క్రీడ‌ల‌కు అత్య‌ధిక ప్ర‌యారిటీ ఇచ్చాడు. ఆపై మ‌హిళ‌ల‌కు చ‌దువు కునేందుకు అవ‌కాశం క‌ల్పించాడు. వాళ్లు కూడా డ్రైవింగ్ నేర్చుకునేందుకు ఓకే చెప్పాడు.

దుబాయ్ ని అన్ని రంగాల‌లో ప్ర‌పంచంలోనే టాప్ లో ఉండేలా చూడాల‌న్న‌ది ఈ యువ‌రాజు క‌ల‌. ఆయ‌న యువ‌రాజు(Dubai Prince) అయిన‌ప్ప‌టికీ త‌న భార్య‌, పిల్ల‌ల‌తో వెకేష‌న్ టూర్ల‌కు వెళుతుంటాడు.

క్రీడ‌ల‌న్నా, వ్యాయామం, ఫిట్ నెస్, ఆధునిక పోక‌డ‌లు అంటే ఇష్టం కూడా. కానీ ఎక్క‌డా సంప్ర‌దాయాల‌కు భంగం వాటిల్ల‌కు త‌నంత‌కు తాను గా ఉంటాడు.

తాజాగా అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. బ్రిట‌న్ లోని ఓ మెట్రోలో త‌న స్నేహితుడితో క‌లిసి సాధార‌ణ ప్రయాణికుడిగా ప్ర‌యాణం చేశాడు. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి.

Also Read : ఇత‌రుల జోక్యాన్ని స‌హించం – చైనా

Leave A Reply

Your Email Id will not be published!