Duty Megistrate Emotional : డ్యూటీ మేజిస్ట్రేట్ ఓదార్పు వైరల్
సోషల్ మీడియాలో హల్ చల్..వీడియో వైరల్
Duty Megistrate Emotional : అగ్నిపథ్ స్కీంపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాలు మనస్తాపానికి గురయ్యారు యువత. రైళ్లను తగులబెట్టారు.
బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. ఇదే సమయంలో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసన మిన్నంటింది. ఓ యువకుడు కాల్పుల్లో మృతి చెందాడు.
సాయుధ దళాలలో తాత్కాలిక పద్దతిన కేవలం నాలుగేళ్ల పాటు మాత్రమే భర్తీ చేయాలని అగ్నిపథ్ స్కీం ఉద్దేశం. బీహార్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ , తదితర రాష్ట్రాలలో ఆందోళనలు విధ్వంసానికి లోను చేశాయి.
ఇదిలా ఉండగా కొన్ని చోట్ల యువకులు శాంతియుత ప్రదర్శన చేపట్టారు. తాజాగా అరుదైన సన్నివేశానికి వేదికగా మారింది హర్యానా లోని పానిపట్ లో చోటు చేసుకుంది.
ఈ నిరసనలో ఆందోళనకారులకు , వాటిని పర్యవేక్షిస్తున్న అధికారుల మధ్య జరిగిన చర్చ భావోద్వేగానికి లోను చేసింది. ఈ సందర్భంగా నిరసకారులు ప్రశ్నలు సంధించారు.
మీ పిల్లలు ఇలాగే నిరసనలు చేస్తుంటే మీరు ఏమి చేస్తారంటూ ఓ యువ నిరసనకారుడు డ్యూటీ మేజిస్ట్రేట్(Duty Megistrate Emotional) ఎల్డీఎం కమల్ గిర్డర్ ను ప్రశ్నించాడు.
దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు కమల్. ఆ ప్రశ్నించిన యువకుడిని ఆలింగనం చేసుకున్నాడు. నువ్వు నా కొడుకు లాంటి వాడివంటూ చెప్పాడు.
కేంద్ర ప్రభుత్వానికి మీ డిమాండ్లను తాను తీసుకు వెళతానని చెప్పాడు. నేను తండ్రిగా చెబుతున్నా. మీ కెరీర్ ను నాశనం చేసుకోకండి అని కోరారు డ్యూటీ మేజిస్ట్రేట్. ప్రస్తుతం డ్యూటీ మేజిస్ట్రేట్ యువకుడిని ఓదార్చిన వీడియో వైరల్ గా మారింది.
Also Read : జాబ్స్ ఇస్తామన్నారు అగ్గి రాజేశారు – రాహుల్