Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, తన ప్రియురాలు మాధురి కాల్ రికార్డ్ లీక్ !
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, తన ప్రియురాలు మాధురి కాల్ రికార్డ్ లీక్ !
Duvvada Srinivas: వైసీపీలో సంచలనంగా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, తన భార్య వాణి, ప్రియురాలు దివ్వెల మాధురి వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోనికి వచ్చింది. ఆగస్టు 11న శ్రీనివాస్ ప్రియురాలు దివ్వెల మాధురి కారు… పలాసలోని లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద ప్రమాదానికి గురైయింది. అయితే కారులో బెలూన్లు సకాలంలో తెరచుకోవడంతో ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే దువ్వాడ వాణి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడటానికి ఈ కారు ప్రమాదం చేసానని అప్పట్లో మాధురి మీడియాకు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమెపై ర్యాష్ డ్రైవింగ్, ఆత్మహత్యాయత్నం కేసులు నమోదు చేసిన పలాస పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే, ప్రమాదం జరిగిన తరువాత మాధురిని అంబులెన్సులో తరలిస్తుండగా, ఆమెతో శ్రీనివాస్(Duvvada Srinivas) ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కాల్ రికార్డ్స్ లో ముందు ఆమె బాగోగులు అడిగిన శ్రీనివాస్(Duvvada Srinivas)… తర్వాత ‘కావాలనే కారుతో ఢీకొట్టి సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. వాణి నాలుగు రోజులుగా చేస్తున్న అరాచకాల వల్లే బలవన్మరణానికి ప్రయత్నించినట్లు మీడియాకు చెప్పు’ అంటూ మాధురికి సూచించారు. వైద్యులతో, పోలీసులతో వ్యవహారం తాను చూసుకుంటానని ఆమెకు అభయమిచ్చారు. దీనితో మాధురి ఆత్మహత్యాయత్నం ఘటన అంతా డ్రామా అని తేలిపోయింది.
Duvvada Srinivas – ఆ రోజు ఏం జరిగిందంటే ?
దువ్వాడ శ్రీను(Duvvada Srinivas) కుటుంబ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న దివ్వెల మాధురి మూడు వారాల కిందట కారు డ్రైవ్ చేసుకుంటూ హైవేలో మరో వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కారు బోల్తాపడింది. ఆ సమయంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. 108 అంబులెన్స్‌లో మాధురిని పలాస ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఆమె దువ్వాడ శ్రీనుకు ఫోన్ చేశారు. కారు ప్రమాదం జరిగినట్టు కాకుండా, దువ్వాడ వాణి చేస్తున్న అరాచకం వల్ల ఆత్మహత్యకు యత్నించానని మీడియాకు చెప్పాలని మాధురికి శ్రీను(Duvvada Srinivas) సూచించారు. ఇందుకు మాధురి ఒప్పుకొన్నారు. ప్రెస్‌ను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని, తాను ఇదే విషయం చెబుతునానని శ్రీనుకు చెప్పారు. ఆ వెంటనే ఆత్యహత్యాయత్నం నాటకం రక్తిగట్టించారు.
శ్రీను, మాధురి ఫోన్ సంభాషణ ఇదే !
మాధురి: ఏవండీ…
దువ్వాడ: ఎలా ఉందే
మాధురి:పర్లేదు
దువ్వాడ: ఏం పనిచేశావు.. ఎంత పనిచేశావు? అందుకే నేను వాడ్ని తీసుకెళ్లు అంటే నామాట వినవు
మాధురి: తీసుకెళ్లుంటే వాడికి కూడా ఏదో అయిపోయేది.
దువ్వాడ: ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది?
మాధురి: తలకు దెబ్బ తగిలింది. తలంతా నొప్పిగా ఉంది
దువ్వాడ: ఇప్పుడు నిన్ను హాస్పిటల్‌లో పెట్టారా?
మాధురి: 108లో ఉన్నానండీ. పలాసలో..
దువ్వాడ: హేమాచలం నీ వెనక వస్తున్నాడు. దగ్గరకు వచ్చేశాడు. పద్మను, అవినాశ్‌ను పంపిస్తున్నాను. ఏమీ వర్రీ అవకు. నువ్వు ఒకటే చెప్పు. ‘నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలనే ఇలా చేశా. నాపై దువ్వాడ వాణి చేసినటువంటి అరాచకం, నాలుగు రోజుల నుంచి జరిగిన అరాచకాల వల్లనే చనిపోవాలనే ఇలా గుద్దేశా’ అని చెప్పు. అన్నీ నేను చూస్తా.
మాధురి: హా.. నేను మనస్తాపం చెంది గుద్ది చచ్చిపోదామని చేశా అని చెబుతా
దువ్వాడ: హా.. అదే వర్డ్. కారణం దువ్వాడ వాణి
మాధురి:ప్రెస్‌ను పంపండి. ఇదే చెబుతా
దువ్వాడ:నువ్వు ఎమోషనల్ అవ్వొద్దు. చనిపోవాలని నాకు నేనుగా గుద్దేశానని చెప్పాలి
మాధురి: నేను బాగానే ఉన్నా. అభికి చెప్పి జీహెచ్‌కు పంపించండి. ప్రెస్‌కు చెప్పి జీహెచ్‌కు పంపించండి
దువ్వాడ:వాళ్లు నీవద్దకు వస్తున్నారు. నేను మెసేజ్ పాస్ చేసేస్తున్నా
మాధురి: నేను బాగానే ఉన్నా. కొంచెం లిప్స్‌కు దెబ్బతగిలింది. ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకు కారు బోల్తా పడి పల్టీ కొట్టేసింది. లక్కీగా ఎవరో వచ్చారు. లేకుంటే పెట్రోల్ లీకై ప్రమాదం జరిగేది
దువ్వాడ: నువ్వు ఇవన్నీ మాట్లాడకు
దువ్వాడ శ్రీనును ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలి – వాణి
దువ్వాడ శ్రీను(Duvvada Srinivas), మాధురి మధ్య జరిగిన ఫోన్ కాల్ ఆడియో వ్యవహారం బయటపడిన నేపథ్యంలో టెక్కలి జడ్పీటీసీ, దువ్వాడ శ్రీను భార్య దువ్వాడ వాణి మీడియాతో మాట్లాడారు. దువ్వాడ శ్రీనును వైసీపీ నుంచి, ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భర్త దువ్వాడ శ్రీను, ఆయన తల్లి, ఆయన సోదరుడు బాబా తనపై కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తుల్ని ఇంకా వైసీపీలో ఉంచడం వల్ల పార్టీకి మరింత నష్టం తప్పదన్నారు. కుట్రల ఆలోచనలతో ఉన్న ఎమ్మెల్సీ శ్రీనుపై తమ పిల్లల భవిష్యత్ కోసమే తాను పోరాడుతునాన్నని స్పష్టం చేశారు.
Also Read : Nara Lokesh : గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై కీలక అంశాలను వెల్లడించిన మంత్రి లోకేశ్