DVAC Raids : అన్నాడీఎంకే మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు
ఎస్పీ వేలుమణి..సి. విజయ భాస్కర్ లకు షాక్
DVAC Raids : అవినీతి కేసులో ఇద్దరు అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, సి. విజయ భాస్కర్ ఇళ్లపై మరోసారి అవినీతి నిరోధక శాఖ (డీవీఏసీ) దాడులు(DVAC Raids) చేపట్టింది.
ఈ సోదాలు, ఆకస్మిక దాడులతో రాష్ట్రంలో కలకలం రేపింది. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో మున్సిపల్ పరిపాలన, ఆరోగ్య శాఖలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మాజీ మంత్రులకు సంబంధించిన 39 ఆస్తులపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్(DVAC Raids) దాడులు చేపట్టింది.
ఇదిలా ఉండగా ఈ ఇద్దరు మాజీ మంత్రులు మాజీ సీఎం ప్రస్తుత ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)కి అత్యంత సన్నిహితులుగా పేరొందారు.
ఎస్పీ వేలుమణి, సీ. విజయ భాస్కర్ పై సెప్టెంబర్ 12న తాజాగా అవినీతి కేసులు నమోదయయాయి. డీవీఏసీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం 2015లో రాష్ట్ర అసెంబ్లీలో పళనిస్వామి వీధి దీపాలకు సంబంధించి లెడ్ లైట్లతో భర్తీ చేసేందుకు బిగ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు.
ఈ ప్రాజెక్టుకు అనుకూలమైన టెండర్లను కేటాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ఖజానాకు ఈ బల్బుల కొనుగోలుతో రూ. 500 కోట్ల నష్టం కలిగించినట్లు మాజీ మంత్రి ఎస్పీ వేలుమణిపై ఆరోపణలు ఉన్నాయి.
ఇక మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ జాతీయ వైద్య కమిషన్ రూల్స్ కి విరుద్దంగా నకిలీ పత్రాలు సృష్టించి వెల్స్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు విమర్శలు ఉన్నాయి.
ఇక 10 గంటల కు పైగా సోదాలు అనంతరం 10 వాహనాలు, రూ. 32.98 లక్షల నగదు, 1,228 గ్రాముల బంగారు ఆభరణాలు, 948 గ్రాముల వెండి వస్తువులు, 316 నేరారోపణ పత్రాలు, 2 లాకర్ కీలను స్వాధీనం చేసుకుంది.
Also Read : ఫడ్నవీస్ భార్యపై అనుచిత కామెంట్స్