Dwajavarohanam : బ్ర‌హ్మోత్స‌వం ధ్వజావరోహణం

ముగిసిన సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్సవాలు

Dwajavarohanam : తిరుమ‌ల – తిరుమ‌ల పవిత్ర‌మైన పుణ్య క్షేత్రం భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. ప్ర‌తి ఏటా శ్రీ‌వారికి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ ఏడాది కూడా అంగ‌రంగ వైభవోపేతంగా , న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో అద్భుతంగా స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వ‌హించింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం.

Dwajavarohanam in Tirumala

తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్స‌వాలు జ‌రిగాయి. క‌లియుగ దైవమైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌లు తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తుల‌కు మాడ వీధుల్లో విహ‌రిస్తూ ద‌ర్శ‌నం ఇచ్చారు. చివ‌ర‌గా ధ్వ‌జారోహ‌ణంతో(Dwajavarohanam) శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు ముగిశాయి.

నిన్న రాత్రి 7 నుండి 9 గంట‌ల మ‌ధ్య బంగారు తిరుచ్చి ఉత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించింది. రాత్రి 9 గంట‌ల నుండి 10 గంట‌ల మ‌ధ్య ధ్వ‌జారోహ‌ణం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి, శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాధం తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేసినందుకు భ‌క్తుల‌కు, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం సిబ్బందికి ధ‌న్య‌వాదాలు తెలిపారు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి.

Also Read : Tirumala Rush : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.11 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!