Jayesh Ranjan : ర‌క్ష‌ర రంగంలో ఏఐ కీల‌కం

స్ప‌ష్టం చేసిన జ‌యేశ్ రంజ‌న్

Jayesh Ranjan : హైద‌రాబాద్ – ర‌క్ష‌ణ రంగంలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ అత్యంత కీల‌క‌మైన పాత్ర పోషిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్. ఏఐపై ఆర్మీ ట్రైనింగ్ క‌మాండ్ ఆధ్వ‌ర్యంలో మిల‌ట‌రీ కాలేజ్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ ఏఐ ఫ‌ర్ మిలిట‌రీ అప్లికేష‌న్స్ పై సెమినార్ నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు జ‌యేశ్ రంజ‌న్.

Jayesh Ranjan Comment Viral

రెండు రోజుల పాటు ఈ సెమినార్ జ‌రిగింది. భార‌త ర‌క్ష‌ణ ద‌ళాల ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్తు స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు కృత్రిమ మేధ‌స్సు ఏ విధంగా తోడ్ప‌డుతుంద‌నే దానిపై విస్తృతంగా చ‌ర్చించారు. ఈ సెమినార్ కు లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ తుముల్ వ‌ర్మ అధ్య‌క్ష‌త వ‌హించారు.

ర‌క్ష‌ణ రంగంలో ప్ర‌ధానంగా బిగ్ డేటా, రోబోటిక్స్ , క్వాంటం కంప్యూటింగ్ , డ్రోన్ టెక్ మొద‌లైన సాంకేతిక‌త‌ల‌ను ఉప‌యోగించు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు జ‌యేశ్ రంజ‌న్(Jayesh Ranjan). పౌర ర‌క్ష‌ణ అనువ‌ర్త‌నాల కోసం కృత్రిమ మేధ‌స్సు అభివృద్ది , విస్త‌ర‌ణ‌పై రాష్ట్ర స‌ర్కార్ దృక్ప‌థం, కార్య‌క్ర‌మాలు,ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌, విధానాల‌ను హైలెట్ చేశారు.

ఈ సెమినార్ ర‌క్ష‌ణ‌, ప‌రిశ్ర‌మ‌ల నైపుణ్యం మ‌ధ్య సాంకేతిక‌త క‌లయిక‌లో ముఖ్య‌మైన మైలు రాయిని గుర్తించింది.

Also Read : Dwajavarohanam : బ్ర‌హ్మోత్స‌వం ధ్వజావరోహణం

Leave A Reply

Your Email Id will not be published!