Laxman Savadi Denied : యెడ్యూరప్ప విధేయుడికి నో ఛాన్స్
189 అభ్యర్థుల్లో 52 మంది కొత్త వారే
Laxman Savadi Denied : కర్ణాటకలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విడుదల కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టాయి. మొత్తం 224 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 142 సీట్లను ప్రకటిస్తే బీజేపీ 189 అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో సిట్టింగ్ లు చాలా మందికి ఛాన్స్ దక్కలేదు.
మొత్తం కొత్త వారికి 52 మందికి ఛాన్స్ ఇచ్చింది బీజేపీ హై కమాండ్ . దీంతో తమకు టికెట్లు దక్కుతాయని ఆశించిన వారంతా ఇప్పుడు నిరసన గళం వినిపిస్తున్నారు. ట్రబుల్ షూటర్ అమిత్ షా , ప్రధాని మోదీ, సీఎం బొమ్మైలను కాదని వారంతా నిప్పులు చెరుగుతున్నారు. మద్దతుదారుల ఆందోళనలతో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది.
బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న లక్ష్మణ్ సవాడి తనకు టికెట్ దక్కక పోవడంతో బుధవారం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆయన కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. విచిత్రం ఏమిటంటే లక్ష్మణ్ సవాది(Laxman Savadi Denied) మాజీ సీఎం బీఎస్ యెడ్యూరప్పకు విధేయుడిగా ముద్ర పడ్డారు.
లక్ష్మణ్ సవాది మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు విధేయుడుగా గుర్తింపు పొందారు. అయితే లక్ష్మణ్ సవాది తనతో మాట్లాడ లేదని చెప్పారు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. రాష్ట్రంలోని అత్యంత శక్తివంతమైన లింగాయత్ నాయకులలో ఒకరు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ కుమఠహల్లి పై ఓడి పోయారు.
Also Read : ఒకే దేశం ఒకే పాలు’ ఒప్పుకోం