CBI Raids DY CM : లిక్కర్ కేసులో మనీష్ సిసోడియా నిందితుడు
మరో 14 మందిని నిందితులుగా చేర్చిన సీబీఐ
CBI Raids DY CM : కేంద్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే నిప్పులు చెరుగుతూ వచ్చిన శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ను అరెస్ట్ చేసింది.
ఇంకో వైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 15 మంది నిందితులుగా చేర్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ. శుక్రవారం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో(CBI Raids DY CM) పాటు నిందితుల జాబితాలో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపి కృష్ణ తో సహా ముగ్గురు అధికారులు ఉన్నారు.
మద్యం పాలసీపై మనీష్ సిసోడియా ఇంటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. మద్యం పాలసీ ఉల్లంఘనలపై సీబీఐ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన నిందితుల జాబితాలో సిసోడియా నెంబర్ 1గా ఉన్నారు.
11 పేజీల పత్రంలో జాబితా చేయబడిన నేరాలు అవినీతి, నేర పూరిత కుట్ర, ఖాతాలు తప్పుగా ఉన్నాయని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఇదిలా ఉండగా ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సిసోడియా ఎలాంటి తప్పు చేయలేదని తీవ్రంగా ఖండించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) అధినేత , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం కావాలని టార్గెట్ చేస్తోందంటూ ఆరోపించారు.
నమోదు చేసిన అధికారులలో డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారీ, అసిస్టెంట్ కమిషనర్ పంకజ్ భట్నాగర్ కూడా ఉన్నారు జాబితాలో.
ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో మద్యం కంపెనీలు, మధ్య దళారులు కలిసి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపించింది.
మనీస్ సిసోడియాకు సన్నిహితులుగా పేరొందిన అమిత్ అరోరా, దినేష్ అరోరా, అర్జున్ పాండేలు మద్యం లైసెన్సుదారుల నుండి కమీషన్ వసూలు చేశారంటూ పేర్కొంది.
Also Read : టైమ్స్ ప్రశంసిస్తే సీబీఐ దాడి చేస్తోంది