Earthquake Ladakh : 4.3 తీవ్రతతో లడఖ్ లో భూకంపం
Earthquake Ladakh : నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఈరోజు 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 10.47 గంటలకు భూమి కంపించింది. ఇప్పటివరకు, ఎటువంటి నష్టం జరగలేదు.
భూకంప కేంద్రం లేహ్ పట్టణానికి ఉత్తరాన 166 కిలోమీటర్ల దూరంలో ఉండగా ,భూమికి 105 కిలోమీటర్లు లోతులో ఇది సంభవించింది. కాగా .. గత ఏడాది సెప్టెంబర్ లో ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించింది.
“లేహ్ యొక్క ఆల్చికి ఉత్తరాన 189 కిమీ దూరంలో 4.8 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. మళ్లా ఇలా సంభవించడం లడఖ్ ప్రాంత వాసులను గాయందోళనకు గురిచేయడం గమనార్హం.
Also Read : హత్రాస్ కేసుపై ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరణ