Eatala Rajender : బండిపై ఫిర్యాదు చేయలేదు
మాజీ మంత్రి ఈటల రాజేందర్
Eatala Rajender : హైదరాబాద్ – మాజీ మంత్రి, గజ్వేల్ , హుజూరాబాద్ నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జెండాకు ఓనర్ అంటేనే పార్టీ బతుకుతుందన్నారు. తాను బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదన్నారు. కావాలని వాళ్లే తనను బయటకు వెళ్లేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తనకు బండి సంజయ్ కు మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు ఈటల రాజేందర్.
Eatala Rajender Comment
బీజేపీలో పార్టీ హైకమాండ్ స్ట్రిక్ట్ గా ఉంటుందని స్పష్టం చేశారు. బండి సంజయ్ కుమార్ పటేల్ రాజీనామా చేశాక పార్టీ గ్రాఫ్ ఏ మాత్రం తగ్గలేదన్నారు . విచిత్రం ఏమిటంటే బండిపై తాను ఎలాంటి హైకమాండ్ కు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని స్పష్టం చేశారు . ఇప్పటి వరకు ఒక్క నివేదిక కూడా తాను ఇవ్వలేదని ఒకవేళ ఇచ్చినట్లు ఉంటే తాను రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు.
తాను నిఖార్సైన తెలంగాణ వాదినని అన్నారు. ఏనాడూ ఎవరికీ తల వంచని నేపథ్యం ఉందన్నారు. వైఎస్సార్ హయాంలో తాను ఒక్కడినే ఒంటరి పోరాటం చేశానని చెప్పారు ఈటల రాజేందర్(Eatala Rajender). రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన గాడి తప్పిందన్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలలో ఓడి పోవడం ఖాయమన్నారు.
Also Read : Rayadas Roy Manthena : దొర పాలనలో విద్య ఆగమాగం