Eatala Rajender : లక్ష కోట్ల ప్రాజెక్టు గంగ పాలైంది
ఈటల రాజేందర్ సీరియస్ కామెంట్స్
Eatala Rajender : ఇల్లందు – మాజీ మంత్రి , హుజూరాబాద్, గజ్వేల్ నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Eatala Rajender) నిప్పులు చెరిగారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ది అని మండిపడ్డారు.
Eatala Rajender Comment about Kaleshwaram
నాలుగున్నర కోట్ల ప్రజల కడుపు కొట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని అన్నారు. కట్టిన మూడేళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ కుంగి పోయిందన్నారు ఈటల రాజేందర్. లక్షా 20 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం గంగ పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ఈరోజు వరకు కేసీఆర్ పశ్చాతం పడడం లేదన్నారు. ఇది అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
కట్టిన మూడేళ్లకే మేడిగడ్డ ఎందుకు కూలి పోయిందో ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, సీఎం కేసీఆర్ కు చాలా తేడా ఉందన్నారు. ఒక రకంగా చెప్పాలంటే నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు ఈటల రాజేందర్.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాక్షస పాలన నుంచి విముక్తం కావాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు.
Also Read : Komatireddy Venkat Reddy : ఆరు గ్యారెంటీల వైపు జనం చూపు