Eatala Rajender : గజ్వేల్ పై ఈటల గురి
సీఎం కేసీఆర్ పై పోటీ
Eatala Rajender : హైదరాబాద్ – తెలంగాణలో రాజకీయ పరంగా ఎన్నికల వేడి రాజుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈసారి మరింత రసవత్తరంగా మారనుంది. ఉద్యమకారుడిగా గుర్తింపు పొంది మొదటి నుంచి కేసీఆర్ కు వెన్ను దన్నుగా నిలిచి, నెంబర్ 2 నేతగా గుర్తింపు పొందిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈసారి సంచలన ప్రకటన చేశాడు.
Eatala Rajender Shocking Comments
తాను కేసీఆర్ పై పోటీకి నిలబడతానని ప్రకటించాడు. ఇది సంచలనంగా మారింది. ఆయన ప్రకటించినట్లుగానే ప్రస్తుతం నవంబర్ లో జరిగే ఎన్నికల్లో ఇటు హుజూరాబాద్ నుంచే కాకుండా అటు కేసీఆర్ పోటీ పడుతున్న గజ్వేల్ నియోజకవర్గంలో కూడా బరిలోకి దిగనున్నారు.
ఈ మేరకు బీజేపీ హై కమాండ్ సైతం ఈటల రాజేందర్(Eatala Rajender) కోరిన విధంగానే రెండు చోట్ల బీజేపీ తరపు నుంచి టికెట్లను కేటాయించింది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే గజ్వేల్ తో పాటు హజూరాబాద్ లో ఫోకస్ పెట్టారు రాజేందర్. మిషన్ ను స్టార్ట్ చేశారు.
ఇక బీజేపీ హైకమాండ్ 119 సీట్లకు గాను తొలి విడతగా 52 సీట్లను ఖరారు చేసింది. ఈటలకు రెండు ఇస్తున్నట్లు ప్రకటించింది. మొత్తంగా గతంలో దేశం మొత్తం హుజూరాబాద్ వైపు చూసింది. ఈసారి రెండు చోట్ల ఎవరు గెలుస్తారనే దానిపై ఫోకస్ పెట్టనుంది.
Also Read : Kodali Nani : నిజం గెలిచింది కాబట్టే బాబు జైల్లో