Eatala Rajender : సికింద్రాబాద్ – ఇంకెంత కాలం ఈ దొర గడీల పాలన. ఇలాగే భరించుకుంటూ పోతే చివరకు ప్రజలను కూడా అమ్మేస్తాడంటూ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, బీజేపీ గజ్వేల్ అభ్యర్థి ఈటల రాజేందర్(Eatala Rajender). ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా నిర్వహించిన రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Eatala Rajender Serious Comments
ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. కేసీఆర్ చెప్పుడు మాటలు వినే పరిస్థితిలో జనం లేరన్నారు. ఇప్పటికే కమలంకు ఓటు వేయాలని డిసైడ్ అయ్యారని జోష్యం చెప్పారు ఈటల రాజేందర్.
తాను గజ్వేల్ లో పోటీ చేస్తున్నానని తెలిసి కామారెడ్డికి పారి పోయాడంటూ ఎద్దేవా చేశారు. గతంలో రాహుల్ గాంధీ కూడా ఇలాగే పోటీ చేశారంటూ సెటైర్ వేశారు. ప్రజలను కలవని సీఎం మనకు అవసరామా అని ప్రశ్నించారు. లక్షా 20 వేల కోట్ల ఖర్చుతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లాగా మారిందని ఆరోపించారు.
Also Read : Digvijaya Singh : మార్పు ఖాయం హస్తందే అధికారం