Eatala Rajender : మంత్రులంతా బానిస‌లు – ఈట‌ల

హ‌రీశ్ రావుపై సీరియ‌స్ కామెంట్స్

Eatala Rajender : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేళ మాట‌ల తూటాలు పేలుతున్నాయి. శ‌నివారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రులంతా కేసీఆర్ కు బానిస‌లేన‌ని అన్నారు. ఎవ‌రైనా ఒక్క‌రైనా సీఎంకు ఎదురు చెప్పే ద‌మ్ము ఉందా అని ప్ర‌శ్నించారు.

Eatala Rajender Comment for Ministers

ఈసారి గ‌జ్వేల్ లో కేసీఆర్ ఓడి పోవ‌డం ఖాయ‌మ‌న్నారు. కానీ తాను ఏనాడూ ఆత్మ గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్ట‌లేద‌న్నారు. తాను ఎవ‌రినీ మోసం చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌పై అవాకులు చెవాకులు పేలితే ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌ను రాజ‌కీయంగా అంతం చేయాల‌ని అనుకున్న కేసీఆర్ చివ‌ర‌కు తన ప‌త‌నానికి తానే కార‌కుడు కాబోతున్నాడ‌ని ఇది చ‌రిత్ర చెప్పిన స‌త్య‌మ‌న్నారు ఈట‌ల రాజేంద‌ర్.

కేసీఆర్ ను కాద‌ని హ‌రీశ్ రావుకు స్వంతంగా నిర్ణ‌యం తీసుకునే స్వేచ్ఛ‌, ద‌మ్ము ఉందా అని ప్ర‌శ్నించారు. ఎవ‌రు ఉద్య‌మ‌కారుడో జ‌నాల‌కు తెలుస‌న్నారు. ఇవాళ త‌న జీవితం తెరిచిన పుస్త‌క‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఈట‌ల రాజేంద‌ర్(Eatala Rajender). ఇక‌నైనా మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు.

Also Read : Varudu Kalyani : బీసీల కుల గ‌ణ‌న‌పై విమ‌ర్శ‌లేలా

Leave A Reply

Your Email Id will not be published!