Eatala Rajender : దొర పాల‌న‌కు ద‌గ్గ‌ర ప‌డింది – ఈట‌ల

బీజేపీ తెలంగాణ‌లో ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయం

Eatala Rajender : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మ‌న్ ఈట‌ల రాజేంద‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని, సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఈనెల 8న దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వ‌రంగ‌ల్ కు రానున్నారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగే భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాట్ల‌ను గురువారం ఈట‌ల రాజేందర్ ప‌రిశీలించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు.

త‌మ మీద కావాల‌ని దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఒక వ‌ర్గం, మీడియా కూడా ప‌నిగ‌ట్టుకుని త‌ప్పుడు రాత‌లు రాస్తూ ప‌లుచ‌న చేసేందుకు య‌త్నిస్తున్నారంటూ ఆరోపించారు ఈట‌ల రాజేంద‌ర్(Eatala Rajender). ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని తెలంగాణ‌లో తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు.

పార్టీకి సంబంధించిన శ్రేణులలో జోష్ నింపేందుకు మోదీ వ‌స్తున్నార‌ని చెప్పారు. వ్యాగ‌న్ ఫ్యాక్ట‌రీకి భూమి పూజ చేస్తార‌ని తెలిపారు ఈట‌ల రాజేంద‌ర్. ఓరుగ‌ల్లు తెలంగాణ‌లో బీజేపీ మంచి ప‌ట్టు క‌లిగిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది వ‌రంగ‌ల్ అని స్ప‌ష్టం చేశారు. కావాల‌ని విషం క‌క్కే ప్ర‌య‌త్నం చేసినా వ‌ర్క‌వుట్ కాద‌న్నారు. ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు మోదీ విజ‌య సంకల్ప స‌భ‌కు వ‌స్తార‌ని చెప్పారు ఈట‌ల రాజేంద‌ర్.

స‌ర్వ వ్య‌వ‌స్థ‌ల‌ను స‌ర్వ నాశ‌నం చేసిన ఘ‌న‌త కేసీఆర్ కు ద‌క్కుతుంద‌న్నారు. ఇవాళ ప్ర‌జ‌లు తీవ్ర నిరాశ‌తో, అసంతృప్తితో ఉన్నార‌ని చెప్పారు. ఇక రాబోయే కాలం కాషాయానిదేన‌ని పేర్కొన్నారు.

Also Read : Elon Musk : మెటా థ్రెడ్స్ పై మ‌స్క్ సెటైర్

 

Leave A Reply

Your Email Id will not be published!