Eatala Rajender : కేసీఆర్ పై ఈటల కన్నెర్ర
బహుజనులు తల్చుకుంటే భూ స్థాపితమే
Eatala Rajender : సికింద్రాబాద్ – భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eatala Rajender) సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ బాస్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకానొక దశలో వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేశారు ఈటల.
Eatala Rajender Slams KCR
బహుజనులు తలుచుకుంటే కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని భూ స్థాపితం చేస్తారంటూ హెచ్చరించారు. సికింద్రాబాద్ లో ముదిరాజుల ఆత్మ గౌరవ సభను నిర్వహించారు. ఈ సమావేశానికి ఈటలతో పాటు బిత్తిరి సత్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రాష్ట్రంలో ముదిరాజులు అత్యధిక జనాభా కలిగి ఉన్నారని, వారి సంఖ్య ప్రకారం కనీసం 11 సీట్లకు పైగా సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 75 శాతానికి పైగా బహుజనులు ఉన్నారని కనీసం కేబినెట్ లో 7 మందికి పైగా మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఎక్కడా దీనిని పాటించడం లేదని ఆరోపించారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఆనాటి సీఎంలు తనను అవమానించినా గట్టిగా ఎదుర్కొన్నానని, నా జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉంటూ వచ్చిన నన్ను అణగ దొక్కాలని చూస్తే అగ్గి బరాటా అవుతానని హెచ్చరించారు. కేసీఆర్ కు మూడిందన్నారు ఈటల రాజేందర్.
Also Read : IND vs AUS World Cup 2023 : భారత్ చేతిలో ఆసిస్ చిత్తు
