Eatala Rajender : కేసీఆర్ నయా నిజాం నవాబు
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
Eatala Rajender : కోరుట్ల – మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి అర్వింద్ కోరుట్ల నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా నామనేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆయన వెంట ఈటల రాజేందర్ ఉన్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Eatala Rajender Comments Viral
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ దోపిడీకి తెర తీసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులన్నీ నీళ్ల పాలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ రాక్షస పాలన పోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.
కాంగ్రెస్ , బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని అన్నారు. పైకి ఆరోపణలు చేసుకుంటూ లోలోపట మిలాఖత్ అయ్యారంటూ ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్(Eatala Rajender). పసుపు బోర్డు తీసుకు వస్తానని ధర్మపురి అర్వింద్ మాట ఇచ్చారని, ఆ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారని గుర్తు చేశారు.
తాము మాట ఇచ్చామంటే తప్పే ప్రసక్తి లేదన్నారు. ప్రజల బాగు కోసం పాలన సాగిస్తున్న బీజేపీని ఆశీర్వదించాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ నయా నిజాం నవాబ్ అంటూ మండిపడ్డారు.
Also Read : Revanth Reddy : కేసీఆర్ పరాజయం ఖాయం