Sri Rama Navami: భద్రాద్రి రామయ్య కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి !
భద్రాద్రి రామయ్య కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి !
Sri Rama Navami: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాములోరి కల్యాణం ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఏప్రిల్ 4న ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.
Sri Rama Navami Updates
గత 40 ఏళ్లుగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నామని, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ తెలంగాణ దేవాదాయశాఖ ఈసీకి లేఖ రాసింది. ఈసీ నిర్ణయంపై రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం తెలిపాయి. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం … బుధవారం నిర్వహించబోయే రాములోరి కళ్యాణ మహోత్సవాన్ని లైవ్ ప్రసారం చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read:Janasena: జనసేనకు హైకోర్టులో ఊరట ! గుర్తు కేటాయింపుపై దాఖలైన పిటిషన్ కొట్టివేత !