Mallikarjun Kharge : మోదీ వైఫ‌ల్యం వ‌ల్లే ఆర్థిక ప‌త‌నం – ఖ‌ర్గే

ప్ర‌ధాన మంత్రిపై కాంగ్రెస్ చీఫ్ ఫైర్

Mallikarjun Kharge : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge). ఆయ‌న అసంబ‌ద్ద పాల‌న వ‌ల్ల దేశం ఇవాళ తీవ్ర ఇబ్బందుల్లో ఉంద‌న్నారు. సోమ‌వారం ఖ‌ర్గే మీడియాతో మాట్లాడారు. దేశం ఎటు పోతుందోన‌న్న సోయి లేకుండా పాల‌న సాగిస్తున్న ప్ర‌ధాన‌మంత్రి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని ఆరోపించారు.

ముందు వెనుకా ఆలోచ‌న లేకుండా నోట్లు ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల దాని ప్ర‌భావం ఆనాటి నుంచి నేటి దాకా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతూనే ఉంద‌ని మండిప‌డ్డారు ఖ‌ర్గే. ఈ నోట్ల ర‌ద్దు వ‌ల్ల వ్యాపారాలు ధ్వంస‌మ‌య్య‌యాని, ఉద్యోగాలు చాలా మంది కోల్పోయారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిన పెట్టేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. 2016లో నోట్లు ర‌ద్దు చేసిన మోదీ ఈరోజు వ‌ర‌కు ఎందుకు ర‌ద్దు చేశామో చెప్ప‌లేక పోయార‌ని ఎద్దేవా చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు క‌ల్పిస్తాన‌ని ఇచ్చిన హామీ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిదేళ్ల మోదీ పాల‌న‌లో క‌నీసం ల‌క్ష పోస్టులు భ‌ర్తీ చేసిన పాపాన పోలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు ఖ‌ర్గే. న‌ల్ల ధ‌నం నుండి దేశానికి విముక్తి క‌ల్పిస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన న‌రేంద్ర మోదీ మాట మార్చాడ‌ని బ‌డా వ్యాపార‌వేత్త‌లు, కార్పొరేట్ల‌కు అనుకూలంగా మారాడ‌ని ఆరోపించారు.

అంతే కాదు దేశాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేసిన ఘ‌న‌త ప్ర‌ధాన‌మంత్రికే ద‌క్కుతుంద‌ని సీరియ‌స్ కామెంట్స్ చేశాడు.

Also Read : 10 శాతం ఈడ‌బ్ల్యుఎస్ రిజ‌ర్వేష‌న్లు స‌బ‌బే

Leave A Reply

Your Email Id will not be published!