Google CEO : ఆర్థిక మాంద్యం పిచాయ్ పై ప్ర‌భావం

గూగుల్ సిఇవో వేత‌నంలో కోత

Google CEO : ప్ర‌పంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం కోలుకోలేని ప్ర‌భావం చూపిస్తోంది. దిగ్గ‌జ కంపెనీలన్నీ కాస్ట్ క‌టింగ్ పై ఫోక‌స్ పెడుతున్నాయి. ఇప్ప‌టికే ఈ ఏడాది 98 వేల మందికి పైగా ఉద్యోగుల‌ను తొల‌గించాయి. ట్విట్ట‌ర్ 12 వేల మందిని తొల‌గించింది. మెటా ఫేస్ బుక్ 12, 000 మంది, మైక్రో సాఫ్ట్ లో 10,000 వేల మంది, ఐబీఎం లో 6,000, గూగుల్ ఇంక్ లో 12,000 మందిని తొల‌గించాయి.

ఇంకా ఇత‌ర రంగాల‌కు చెందిన కంపెనీలు సైతం కొలువుల‌పై కోత పెడుతున్నాయి. తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది గూగుల్. ప్ర‌పంచ సెర్చింగ్ టెక్ దిగ్గ‌జం గూగుల్ కు సిఇవో గా సుంద‌ర్ పిచాయ్(Google CEO) కొలువు తీరారు. సుంద‌ర్ భార‌త దేశానికి చెందిన త‌మిళ‌నాడు వాసి. మ‌రో వైపు మైక్రోసాఫ్ట్ కు సిఇఓగా ఉన్న స‌త్య నాదెళ్ల ఏపీలోని అనంత‌పురం జిల్లాకు చెందిన వారు. ఆయ‌న తండ్రి సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ యుగంధ‌ర్.

ఇదిలా ఉండ‌గా గూగుల్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. భారీ ఎత్తున కొలువుల‌ను తొల‌గించిన త‌ర్వాత త‌నకు ఇచ్చే వేత‌నంలో కూడా కోత పెట్టేందుకు ఓకే చెప్పిన‌ట్లు టాక్. ప్ర‌స్తుతం సుంద‌ర్ పిచాయ్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఐటీ రంగంలో క‌ల‌క‌లం రేపుతోంది. ఏడాదికి ఏకంగా కోట్లాది రూపాయ‌ల వేత‌నం అందుతోంది.

తాజాగా సంస్థ ఉద్యోగుల స‌మావేశంలో గూగుల్ సిఇవో సుంద‌ర్ పిచాయ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ , అంత కంటే పై స్థాయిల‌లో ప‌ని చేసే వారి వేత‌నాల్లో కోత విధిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక ఆపిల్ సిఇఓ కుక్ కూడా త‌న వేత‌నంలో 40 శాతం వేత‌నం త‌గ్గించు కోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Also Read : ట్విట్ట‌ర్ పై ఎలోన్ మ‌స్క్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!