Delhi Liquor Scam Malhotra : నిన్న గోరంట్ల నేడు మ‌ల్హోత్రా

మ‌ద్యం కుంభ‌కోణం అరెస్ట్ ల ప‌ర్వం

Delhi Liquor Scam Malhotra : ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో రోజు రోజుకు ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ చీఫ్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌విత‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది.

గ‌తంలో ఆమెకు చార్టెర్డ్ అకౌంటెంట్ గా ప‌ని చేసిన గోరంట్ల బుచ్చిబాబును మంగ‌ళ‌వారం అదుపులోకి తీసుకుంది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌. ఇదే కేసుకు సంబంధించి మ‌రొక కీల‌క వ్య‌క్తి గా భావిస్తున్న గౌత‌మ్ మ‌ల్హోత్రాను అదుపులోకి తీసుకుంది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ).

రాత్రికి రాత్రే బుచ్చిబాబును ఢిల్లీకి త‌ర‌లించారు. దీంతో క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో క‌ల‌క‌లం మొద‌లైంది. ఈ కేసులో ఇప్ప‌టికే అప్రూవ‌ర్ గా మారిన తర్వాత ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఒక్కొక్క‌రినీ అరెస్ట్ చేస్తోంది ఈడీ.

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌గా ఉన్నారు గౌత‌మ్ మ‌ల్హోత్రా(Delhi Liquor Scam Malhotra). ఆయ‌న‌ను బుధ‌వారం అదుపులోకి తీసుకుంది. అనంత‌రం సీబీఐ స్పెష‌ల్ కోర్టులో హాజ‌రుప‌ర్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది మందిని అరెస్ట్ చేసింది. ఇదే కేసుకు సంబంధించి రెండో చార్జ్ షీట్ ను ఇటీవ‌లే స‌మ‌ర్పించింది.

ఇందులో ఇద్ద‌రిని కొత్త‌గా చేర్చింది. వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తో పాటు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేరును చేర్చింది. ఆ ఇద్ద‌రూ కీల‌క‌మైన ప్ర‌ముఖులుగా గుర్తింపు పొందారు. అయితే ఇదంతా కేంద్రం ఆడుతున్న నాట‌కంలో ఒక భాగ‌మ‌ని ఆరోపించారు కేజ్రీవాల్. తాను ఎలాంటి విచార‌ణ ఎదుర్కొనేందుకైనా సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు క‌విత‌.

Also Read : జెండా ఎగ‌రేసినందుకు జైల్లో పెట్టారు

Leave A Reply

Your Email Id will not be published!