ED Arrests Saket Gokhale : సాకేత్ గోఖ‌లే కు షాక్ ఈడీ అరెస్ట్

నిధుల దుర్వినియోగం నిజం

ED Arrests Saket Gokhale : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, సోష‌ల్ మీడియా ఇన్ ఛార్జ్ గా ఉన్న సాకేత్ గోఖ‌లే ఇప్ప‌టికే జైలులో ఉన్నారు. ఆయ‌న‌ను తాజాగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. గ‌తంలో సాకేత్ గోఖ‌లే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కి వ్య‌తిరేకంగా ట్వీట్ చేశారు.

ఇదే స‌మ‌యంలో ఆయ‌న‌ను నిధుల దుర్వినియోగానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోపిస్తూ అరెస్ట్ చేశారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేక‌రించిన డ‌బ్బును ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిని ఆధారంగా చేసుకుని టీఎంసీ నేత సాకేత్ గోఖ‌లేను(ED Arrests Saket Gokhale) అహ్మ‌దాబాద్ క్రైమ్ బ్రాంచ్ డిసెంబ‌ర్ 30న అరెస్ట్ చేసింది.

ఇప్ప‌టికే చీటింగ్ కేసులో గుజ‌రాత్ జైల్లో ఉన్నాడు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ. 1.07 కోట్ల‌ను సేక‌రించాడ‌ని ఈడీ గుర్తించింది. ఈ మేర‌కు ఇందుకు సంబందించిన ఆధారాల‌ను బ‌య‌ట పెట్టింది. సాకేత్ గోఖ‌లే ను గ‌త ఏడాది 2022 డిసెంబ‌ర్ 30న ఢిల్లీ నుండి అదుపులోకి తీసుకుంది.

ఇదిలా ఉండ‌గా సాకేత్ గోఖ‌లేను గుజ‌రాత్ పోలీసులు అరెస్ట్ చేయ‌డం వ‌రుస‌గా ఇది మూడోసారి కావ‌డం విశేషం. కాగా త‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ కోర్టును ఆశ్ర‌యించారు సాకేత్ గోఖ‌లే. దీనికి స‌సేమిరా ఒప్పుకోలేదు గుజ‌రాత్ హైకోర్టు. ఆయ‌నకు బెయిల్ ఇచ్చేది లేదంటూ స్ప‌ష్టం చేసింది.

గుజ‌రాత్ లోని మోర్బీలో బ్రిడ్జి కూలిన ఘ‌ట‌న‌లో 135 మంది మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌కు మోదీ బాధ్య‌త వ‌హించాలంటూ ట్వీట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. దీని ఆధారంగా సాకేత్ గోఖ‌లే ను(ED Arrests Saket Gokhale) అరెస్ట్ చేసింది.

Also Read : కాంగ్రెస్ కు అనిల్ కే ఆంటోనీ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!