MLC Kavitha ED : కవితకు ఛాన్స్ ఇవ్వకండి – ఈడీ
సుప్రీంకోర్టుకు దర్యాప్తు సంస్థ
ED Orders MLC Kavitha : అందరి కళ్లు ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ముద్దుల కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha)పై ఉన్నాయి. ఇంతకూ ఆమె ఈడీ విచారణ ముందుకు వస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే సీబీఐ తన నివాసంలో విచారించింది. మనీ లాండరింగ్ వ్యవహారం చోటు చేసుకుందనే ఆరోపణలపై ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నోటీసు జారీ చేసింది. మార్చి 11న ఈడీ ముందు విచారణకు హాజరైంది.
ఉదయం 11 గంటలకు వెళ్లిన కల్వకుంట్ల కవిత రాత్రి 8.05 గంటలకు బయటకు వచ్చింది. మార్చి 16న తిరిగి హాజరు కావాల్సి ఉండగా తనకు ఆరోగ్యం బాగో లేదని , తాను సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, మార్చి 24న విచారణకు రానుందని తనను విచారణ చేపట్టకుండా ఈడీని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు అదేం కుదరదంటూ స్పష్టం చేసింది. ఆమె వేసిన పిటిషన్ లో ఈడీపై సంచలన ఆరోపణలు కూడా చేసింది.
రావాల్సిందేనంటూ ఈడీ స్పష్టం చేసింది. ఉదయం 11 గంటలకు రావాల్సి ఉండగా రాక పోవడంతో కవిత తరపున న్యాయవాది సామ భరత్ ఈడీకి రాలేదంటూ నోటీస్ ఇచ్చారు. దీనిపై స్పందించిన ఈడీ కుదరదని తేల్చింది. మరో ఛాన్స్ ఇస్తూ మార్చి 20న రావాల్సిందేనని స్పష్టం చేసింది.
ముందు జాగ్రత్తగా కవిత చాలా తెలివిగా వ్యవహరిస్తోందని గ్రహించిన ఈడీ(ED Orders MLC Kavitha) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎలాంటి ముందస్తు ఆర్డర్ పాస్ చేయొద్దంటూ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి నిర్ణయాలు వెల్లడించవద్దంటూ కోరింది. ఈడీ తో పాటు కవిత తరపు లాయర్లు వాదనలు వినిపించనున్నారు.
Also Read : అద్భుత విజయం బాబు ఉత్సాహం