ED Chief Supreme Court : ఈడీ చీఫ్ పొడిగింపు చ‌ట్ట విరుద్దం

సుప్రీంకోర్టు సంచ‌ల‌న కామెంట్స్

ED Chief Supreme Court : కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజ‌య్ కుమార్ మిశ్రా(Sanjay Kumar Mishra) ప‌ద‌వీ కాలం మూడోసారి పొడిగించ‌డం చ‌ట్ట విరుద్ద‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొంది. ద‌ర్యాప్తు సంస్థ‌కు వెంట‌నే కొత్త చీఫ్ ను నియ‌మించాల‌ని పేర్కొంది.

2021లో కోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించ‌డం దారుణ‌మ‌ని అభిప్రాయ‌ప‌డింది ధ‌ర్మాస‌నం. గ‌తంలో ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసినా ఎందుక‌ని కేంద్రం ప‌ట్టించు కోలేదంటూ నిల‌దీసింది. గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ఇక పొడిగించేందుకు ఒప్పుకోమ‌ని , కేవ‌లం జూలై 31 వ‌ర‌కు మాత్ర‌మే ప‌ర్మిష‌న్ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

దేశంలో మిశ్రా కంటే త‌గిన వారు ఇన్నేళ్లుగా కేంద్ర స‌ర్కార్ కు క‌నిపించ లేదా అంటూ నిల‌దీసింది. చివ‌ర‌కు కేంద్రం త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఎఫ్టీఎఫ్ కేసు విచార‌ణ‌లో ఉంద‌ని అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను ఈడీ చీఫ్ గా కొన‌సాగేలా అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. చివ‌ర‌కు ధ‌ర్మాస‌నం ఒప్పుకుంది. ఇదే లాస్ట్ ఛాన్స్ అని వెంట‌నే మార్చాలంటూ స్ప‌ష్టం చేసింది. ఇంకొక‌రిని నియ‌మించాల‌ని ఆదేశించింది. లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది ధ‌ర్మాస‌నం.

Also Read : MLA Rajaiah KTR : క‌డియం ప‌వ‌ర్ స్టేష‌న్ గా మారారు

Leave A Reply

Your Email Id will not be published!