CM Chandrababu : స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ

ఈడీ విచారణ ప్రకారం నిధుల డైవర్షన్ విషయంలో చంద్రబాబు ప్రమేయం లేదని నిరూపణ అయింది...

CM Chandrababu : స్కిల్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. జగన్ ప్రభుత్వం హయాంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తోంది. అయితే ఈ కేసులో తాజాగా ఈడీ చేసిన ప్రకటన కీలకంగా మారింది. ఈడీ తాజా విచారణ తర్వాత సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు ఈ అంశంలో ఎలాంటి ప్రమేయం లేదని రుజువైంది. ఈడీ విచారణ ప్రకారం నిధుల డైవర్షన్ విషయంలో చంద్రబాబు ప్రమేయం లేదని నిరూపణ అయింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై వైసీపీ నేతలు చేసిన అసత్య ప్రచారాన్ని ఈడీ వర్గాలు తప్పు పట్టాయి.

CM Chandrababu Case Updates

ఈ కేసులో తాజా ఆస్తుల అటాచ్‌మెంట్‌లో చంద్రబాబు(CM Chandrababu)కు ఎలాంటి సంబంధం లేదని ఈడీ స్పష్టం చేసింది. వినాయక్ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ సహ పలువురు బోగస్ ఇన్‌వాయిస్‌లు సృష్టించి ఈ పనికి పాల్పడినట్లు గుర్తించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఈడీ స్టేట్‌మెంట్‌లో నమోదు కాలేదు. మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకు కానీ ఆయనకు సంబంధించిన వారికి డబ్బులు అందినట్లుగా ఎక్కడా చూపించలేదు. దీంతో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా స్కిల్ కేసులో జగన్ సర్కార్ హయాంలో చంద్రబాబుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారు. 53 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. ఆ కేసులో సీఐడీ అధికారులు ఒక్క రూపాయి కూడా అక్రమ లావాదీవీ చూపించలేకపోయిందని బెయిల్ ఇచ్చిన సమయంలో న్యాయస్థానం స్పష్టం చేసింది.

2023, సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని బస్సులో విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దాంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తీసుకు వెళ్లారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాదాపు 52 రోజుల అనంతరం చంద్రబాబునాయుడు(CM Chandrababu) బెయిల్‌పై విడుదలయ్యారు.

చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో యువగళం పాదయాత్రను నారా లోకేశ్ తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం ఇల్లు వదిలి ప్రజల మధ్యకు వచ్చారు. నారా లోకేశ్, నారా భువనేశ్వరి ఇద్దరు చంద్రబాబును జైల్లో కలిసి ఆయన క్షేమ సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేవారు. ఇక చంద్రబాబు అక్రమ అరెస్ట్ నేపథ్యంలో వందలాది మంది మరణించారు. ఈ నేపథ్యంలో నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం అందించడమే కాదు.. మీకు, మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండ, దండ.. గా ఉంటుందని భరోసా కల్పించారు.

Also Read : Jammu Kashmir : కాంగ్రెస్ పై కీలక నిర్ణయం తీసుకున్న ‘ఒమర్ అబ్దుల్లా’ సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!