Nawab Malik ED : మహారాష్ట్ర సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్దం నడుస్తున్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముంబై అండర్ వరల్డ్ తో సంబంధం ఉన్న కేసులో మహారాష్ట్ర వికాస్ అగాధీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న నవాబ్ మాలిక్(Nawab Malik ED) ను ఈడీ ప్రశ్నించింది.
ఈ విషయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించారు. రెండు వారాల కిందట రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం యత్నిస్తోందంటూ నవాబ్ మాలిక్ ఆరోపించారు.
ఈ తరుణంలో ఈడీ రంగంలోకి దిగడం విస్తు పోయేలా చేసింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో అంతర్గత సంబంధాలపై ఆరా తీసింది ఈడీ.
ఇదిలా ఉండగా ఇవాళ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ – ఈడీ కార్యాలయానికి విచారణ కోసం తీసుకు వెళ్లారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – ఎన్సీపీ నేత మాలిక్ ఇంటికి చేరుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు గంట పాటు ప్రశ్నించారు.
7. 30 గంటలకు ఈడీ కార్యాలయానికి తీసుకు వచ్చారు. ఇంకా మంత్రిని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న దావూద్ ఇబ్రహీం, ఆయన సహాయకుల కార్యకలాపాలతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి 62 ఏళ్ల మంత్రికి సమన్లు పంపించామని ఈడీ తెలిపింది.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఏజెన్సీ వాంగ్మూలాన్ని నమోదు చేస్తోంది. ఇదిలా ఉండగా మంత్రి నవాబ్ మాలిక్(Nawab Malik ED) కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
ఇవాళ ఈడీ మంత్రి నివాసానికి వచ్చారు. ఆయనను తమతో పాటు తీసుకు వెళ్లారు. మంత్రితో పాటు తన కుమారుడు అడ్వకేట్ అమీర్ మాలిక్ కూడా ఉన్నారని పేర్కొంది.
Also Read : పుర, స్థానిక ఎన్నికల్లో డీఎంకే జోరు